
‘తులం బంగారం’ హామీ ఏమైంది..?
ఇచ్చోడ: మండలంలోని ముఖరా (కే) గ్రా మంలో గురువారం నిర్వహించిన ఓ పెళ్లి వే డుక నిరసన వేదికగా మారింది. కాంబ్లే అముల్–గీతాంజలి వివాహానికి గ్రామ మాజీ సర్పంచ్ మీనాక్షి, మాజీ ఎంపీటీసీ సుభాష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు నూతన వధూవరులతో కలిసి కల్యాణలక్ష్మి పథకం అమలు తీరుపై ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. ఈ పథకం కింద తులం బంగారం ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 14 నెలలు దాటిందన్నారు. అయినా ఎందుకు అమలు చేయడం లేదని వారు ప్రశ్నించారు.