
కలెక్టరేట్ ఎదుట వీధి వ్యాపారుల ధర్నా
కై లాస్‌నగర్: ఆదిలాబాద్ పట్టణంలోని వీధి వ్యాపారుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా అధికారులు తగు చర్యలు చేపట్టా లని మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ డిమాండ్ చేశారు. గణేశ్ థియేటర్ స్థలంలోకి తమ దుకాణాలను మార్చాలనే అధికారుల నిర్ణయాన్ని తప్పుపడుతూ సో మవారం కలెక్టరేట్ ఎదుట వీధి వ్యాపారులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలోనూ వీధి వ్యాపారులను గణేశ్ ఽథియేటర్‌లోని స్థలా నికి మార్చిన అధికారులు ఆ స్థలాన్ని ము న్సిపల్ అధికారులు లీజుకు ఇవ్వడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోవాల్సి వచ్చిందన్నారు. మరోసారి తాత్కాలికంగా అదే స్థలంలో అధికారులు వారికి స్థలాలను కేటా యించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. అ నంతరం కలెక్టర్ రాజర్షి షాకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు సిరాజ్‌ఖాద్రీ, షాకత్ హుస్సేన్, ఖిజర్ పాషా తదితరులు పాల్గొన్నారు.