
ఆదర్శప్రాయుడు జ్యోతిబాపూలే
● కలెక్టర్ రాజర్షిషా
ఆదిలాబాద్‌టౌన్: మహాత్మా జ్యోతిబాపూలే అందరికీ ఆదర్శ ప్రాయుడని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జ్యోతిబా పూలే జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా ని ర్వహించారు. బీసీ స్టడీ సర్కిల్‌లో పూలే విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం భూక్తాపూర్ పూలే చౌక్‌లో జ్యోతిబాపూలే చిత్రపటా నికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆ తర్వా త జెడ్పీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో కలెక్టర్ రాజర్షి షా, ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మహిళలకు విద్య అందించేందుకు జ్యోతి బాపూలే సేవలను కొనియాడారు. ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ పూలే అడుగుజాడల్లో నడవాలని పిలుపనిచ్చారు. ఇదిలా ఉండగా కలెక్టర్ ఇటీవల స్కోచ్ అవార్డు అందుకున్న సందర్భంగా ఎమ్మెల్యే, బీసీ సంఘాల నాయకులు కలెక్టర్‌ను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీవో వినోద్ కుమార్, బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజలింగు, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, బీసీ సంఘ అధ్యక్షుడు దత్తు, ప్రధాన కార్యదర్శి కలాల శ్రీనివాస్, మాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుకుమార్, విజయ్ కుమార్, బీసీ సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.