కై లాస్‌నగర్: జిల్లాను క్షయ రహితంగా మార్చేందు కు సమాజంలోని ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చే యాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రపంచ క్షయ నియంత్రణ దినోత్సవం పురస్కరించుకుని కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం ప్రత్యేక కా ర్యక్రమం నిర్వహించారు. టీబీ వైరస్‌ను కనిపె ట్టిన ప్రొఫెసర్ రాబర్ట్ కోచ్ చిత్రపటానికి పూలమాల వే సి, కార్యక్రమాన్ని ప్రారంభించారు. క్షయ నియంత్రణలో భాగంగా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన వంద రోజుల కార్యక్రమం విజయవంతం చే యడంపై సిబ్బందిని అభినందించారు. అనంత రం వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోస్టర్ ఆ విష్కరించారు. క్షయ నిర్మూలించేందుకు కృషి చేస్తానని తెలిపే బ్యానర్‌పై స్వయంగా కలెక్టర్ సంతకం చేశారు. ఇందులో రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్, జిల్లా క్షయ ని యంత్రణాధికారి సుమలత, వైద్యులుపాల్గొన్నారు.
కలెక్టరేట్ ఏవోకు సన్మానం
ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్న కలెక్టరేట్ ఏవో బి.రాంరెడ్డి దంపతులను కలెక్టర్ రాజర్షి షా ఘనంగా సన్మానించారు. పట్టణంలోని రెవెన్యూగార్డెన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో గజమా ల, శాలువతో సత్కరించి విడ్కోలు తెలిపారు.
కలెక్టర్ తీరుపై దళిత సంఘాల నిరసన
కై లాస్‌నగర్: మహానీయుల జయంతి కార్యక్రమాల ఏర్పాట్లపై సమావేశం ఉందని ఆహ్వా నించి అధికా రులు రాకపోవడంపై దళిత సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్ సమావేశ మందిరం వద్ద నిరసన తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి ఉత్సవాల నిర్వహణ ఏ ర్పాట్లపై సమావేశం ఉంటుందని దళితాభివృద్ధి శాఖ కార్యాలయం నుంచి దళిత సంఘాలకు సమాచారం అందించారు. దీంతో వారంతా అక్కడికి చే రుకున్నారు. సాయంత్రం 4.30 గంటల వరకు వేచి చూసినా డీఎస్సీడీవో తప్పా అధికారులెవరు హా జరు కాలేదు. కలెక్టర్ తమను పిలిపించి గైర్హాజరు కాకపోవడం సరికాదని ఆయా సంఘాల నాయకులు అన్నారు. ఇందులో నాయకులు స్వామి, ప్రజ్ఞ కుమార్, మల్లన్న, విఠల్, దయవాశీల హుక్కే, రమాకాంత్, సందీప్, రాజన్న, తదితరులున్నారు.