
అందుబాటులోకి సీఎన్‌జీ యూనిట్లు
● జిల్లాలో నాలుగు చోట్ల ఏర్పాటు ● త్వరలో ప్రారంభించేందుకు సిద్ధం ● పెరిగిన ఈ–వాహనాల వినియోగం
సాక్షి, ఆదిలాబాద్: కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్ జీ) యూనిట్లు జిల్లాలోనూ అందుబాటులోకి వస్తున్నాయి. నాలుగుచోట్ల ఏర్పాటు చేసిన వీటిని వా రంరోజుల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం సీఎన్‌జీ వాహనాల వినియోగం కూడా బాగా పెరిగింది. అయితే ఈ ఇంధనం లభించే పాయింట్లు ఇప్పటివరకు లేక అక్రమ పద్ధతిలో ఫిల్లింగ్ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీని కారణంగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్లు రవా ణారంగ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ గ్యాస్ లభించే యూనిట్లు ఏర్పాటవుతుండటంతో ఈ–వాహనాల వినియోగం మరింత పెరిగే ఆస్కారముంది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) ఆధ్వర్యంలో తొలిసారిగా ఆదిలాబాద్ పట్టణంలోని దస్నాపూర్ తిరుమల ఫిల్లింగ్ స్టేషన్, ఖుర్షీద్‌నగర్ జైళ్లశాఖ పెట్రోల్ పంపు, గుడిహత్నూర్ మండలంలోని సీతాగొంది (కమలాపూర్) సమీపంలోని దర్వి పెట్రోల్ బంక్, జైనథ్ మండలం భోరజ్‌లోని కోకో పెట్రోల్ పంపులో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. సీతాగొంది యూనిట్ మినహా మిగతా యూనిట్ల నిర్మాణం పూర్తయింది.
డిమాండ్ నేపథ్యంలోనే..
పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీతో నడిచే వాహనాలకు తో డు ప్రస్తుతం మార్కెట్‌లో సీఎన్‌జీ వాహనాల విని యోగం పెరుగుతూ వస్తోంది. దీనికి తగ్గట్లుగా ఇంధనం మార్కెట్‌లో లభించకపోవడంతో వాహనదా రులు ఇబ్బంది పడుతున్నారు. పెట్రోల్, డీజిల్ వి క్రయం లీటర్లలో, సీఎన్‌జీ విక్రయంలో కేజీల్లో ఉంటుంది. ప్రస్తుతం దీని ధర కేజీకి రూ.93 వరకు ఉ న్నట్లు పెట్రోలియం వ్యాపారులు పేర్కొంటున్నా రు. కాగా, జిల్లాలో ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న ఒ క్కోసీఎన్‌జీ డిస్పెన్సరీ యూనిట్ సామర్థ్యం సుమా రు 3వేల కేజీలుగా చెబుతున్నారు. ఒక్కోదానిని రూ.కోటిన్నర అంచనాతో ఏర్పాటు చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఆదిలాబాద్ మార్కెట్‌లో సీఎన్‌జీ విస్తృతంగా లభించే పరిస్థితి ఉండగా ఈ–వాహనాలు వినియోగించే వారికి ఊరట లభించనుంది.