కై లాస్‌నగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకం కింద స్వయం ఉపాధి కోసం జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ (ఈడబ్ల్యూఎస్)కులాలకు చెందిన నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా ప్రకటనలో తెలిపారు. ఈ పథకం ద్వారా గరిష్టంగా రూ.4 లక్షల వరకు రుణం పొందవచ్చని పేర్కొన్నారు. రూ.50వేల లోపు విలువ చేసే యూనిట్‌కు వంద శాతం సబ్సిడీ వర్తిస్తుందని తెలిపారు.
రూ.లక్ష లోపు యూనిట్ కు 90 శాతం సబ్సిడీ, రూ.2 లక్షల యూనిట్‌కు 80 శాతం సబ్సిడీ, రూ.4 లక్షల వరకు గల యూ నిట్‌కు 70 శాతం సబ్సిడీ వర్తిస్తుందని పేర్కొన్నారు. వ్యవసాయేతర పథకాల యూనిట్ల స్థాపనకు దరఖాస్తు చేసుకునే వారి వయస్సు 21నుంచి 55 ఏళ్ల లోపు ఉండాలని, అలాగే వ్యవసాయ ఆధారిత పథకాలకు దరఖాస్తు చేసే వారి వయస్సు 21నుంచి 60 ఏళ్లలోపు ఉండాలని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వారి కుటుంబ వార్షికాదాయం రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో వారయితే రూ.2లక్షల్లోపు ఉండాలని తెలిపారు. అలాగే బ్యాంక్ సమ్మతి తప్పనిసరి అని పేర్కొన్నారు.
దరఖాస్తుకు ఆధార్‌కార్డు, పాన్‌కార్డు, కుల, ఆదాయ, నివాస, విద్యార్హత ధ్రువీకరణ పత్రాలతో పాటు బ్యాంకు ఖాతా తప్పనిసరిగా జతచేయాలని సూచించారు. ఆసక్తి గల వారు tgobmmsnew.cgg.gov. in వెబ్‌సైట్ ద్వారా ఏప్రిల్ 5లోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసిన దరఖాస్తుతో పాటు ధ్రువీకరణ పత్రాల ప్రతులను జత చేసి సంబంధిత ఎంపీడీవో, మున్సి పల్ కార్యాలయాల్లో అందజేయాలని పేర్కొన్నా రు. ఈ అవకాశాన్ని అర్హులైన వారంతా సద్విని యోగం చేసుకోవాలని సూచించారు.
రంజాన్‌ను ఆనందంగా జరుపుకోవాలి
జిల్లాలోని ముస్లింలు రంజాన్ పండుగను ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలని కలెక్టర్ రా జర్షి షా కోరారు. పవిత్ర మాసంలో ప్రతీ ముస్లిం నెల రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలు చేపడతారని పేర్కొన్నారు. అల్లా ఆశీస్సులతో అందరి కి శుభాలు కలగాలని ఆకాంక్షిస్తూ పండుగ శుభా కాంక్షలు తెలిపారు.


