
పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
కైలాస్‌నగర్: జిల్లాలో ఓపెన్ స్కూల్ పదో తరగ తి, ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అడిషనల్ కలెక్టర్ కే శ్యామలాదేవి సూచించారు. పరీక్షల నిర్వహణపై గురువారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో వివిధ శాఖల అఽధికారులతో సమావేశమై మాట్లాడారు. ఏప్రిల్ 20 నుంచి 26వ తేదీ వరకు ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, మధ్యాహ్నం 2.30నుంచి సాయంత్రం 5.30 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పదో తరగతి పరీక్షలకు 623 మంది, ఇంటర్మీడియట్ పరీక్షలకు 465 మంది అభ్యాసకులు హాజరు కానున్నట్లు తెలిపారు. పదో తరగతికి మూడు, ఇంటర్మీడియట్ విద్యార్థులకు రెండు పరీక్షాకేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అభ్యాసకులు గంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని తెలిపారు. పరీక్షాకేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ఈ నెల 26నుంచి మే 3వరకు ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో నిర్వహించనున్నట్లు వివరించారు. ఓపెన్ స్కూల్ జిల్లా కో ఆర్డినేటర్ ఎన్.అశోక్, డిప్యూటీ డీఎంహెచ్‌వో సాధన తదితరులు పాల్గొన్నారు.