
తుదిదశకు పిట్‌లైన్
ఆదిలాబాద్‌లో పిట్‌లైన్ పనులు తుదిదశకు చేరుకున్నాయి. రూ.17.90 కోట్ల అంచనా వ్యయంతో 24 కోచ్‌లతో దీని నిర్మాణం సాగుతోంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని నాందేడ్ రైల్వే డివిజన్ పరి ధిలోకి వచ్చే ఆదిలాబాద్ రైల్వేస్టేషన్ నుంచి రాను న్న రోజుల్లో పలు రైళ్ల రాకపోకలకు ఈ పిట్‌లైన్ దోహదపడనుంది. ప్రధానంగా పిట్‌లైన్ ఏర్పాటుతో ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్ల కోచ్‌ల ప్రాథమిక నిర్వహణ ఇక్కడే జరగనుంది. పగలు, రాత్రి రైల్వే కోచ్‌ల తనిఖీలు, క్లీనింగ్, చార్జింగ్ చేస్తారు. దీని ఏర్పాటుతో పలు రైళ్ల గమ్యస్థానం ఆదిలాబాద్ నుంచే మొదలయ్యే ఆస్కారముంటుంది. ఇప్పటి కే నాందేడ్ స్టేషన్‌కు వచ్చే రైళ్ల రద్దీ పెరిగిపోగా వా టిని ఇతర స్టేషన్లకు పొడిగించాలనే డిమాండ్ ఉంది. ఆదిలాబాద్‌కు ఆ రైళ్లను పొడిగించాలని ఏళ్లుగా పౌరసమాజ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.