
వృద్ధుల సంరక్షణే ధ్యేయం
ఆదిలాబాద్‌టౌన్: వృద్ధుల సంరక్షణే ధ్యే యంగా ముందుకు సాగుతున్నామని వయో వృద్ధుల సమాఖ్య జిల్లా అధ్యక్షుడు డాక్టర్ దేవిదాస్ దేశ్‌పాండే అన్నారు. ఉగాది పండుగ సందర్భంగా జిల్లా కేంద్రంలోని భుక్తాపూర్‌లో 70 ఏళ్లు నిండిన వృద్ధులను ఆదివారం సన్మానించారు. బండారి రాజ మ్మ, వై.రాములు, వై.సరోజినిదేవి, లక్ష్మి, స మ్మక్క, విజయలక్ష్మిలకు ఔషధ మొక్కలు అందజేసి శాలువాలతో సత్కరించారు. కా ర్యక్రమంలో సంఘం నాయకులు నర్సింలు, దేవాసింగ్, వెంకటి, ప్రకాశ్, ఈర్ల సత్యనారాయణ, పాశం రాఘవేంద్ర, కంది శ్రీని వాసరెడ్డి, నాగేశ్వర్, రాజేశ్ పాల్గొన్నారు.