సన్నబియ్యం వచ్చినయ్‌ | - | Sakshi
Sakshi News home page

సన్నబియ్యం వచ్చినయ్‌

Apr 2 2025 1:04 AM | Updated on Apr 2 2025 1:04 AM

సన్నబియ్యం వచ్చినయ్‌

సన్నబియ్యం వచ్చినయ్‌

రీసైక్లింగ్‌ దందాకు ఇక అడ్డుకట్ట..

ప్రభుత్వం చేపట్టిన సన్నబియ్యం పంపిణీతో పేదలకు న్యూట్రిషియన్‌ ఫుడ్‌ అందడంతో పాటు బియ్యం రీసైక్లింగ్‌ దందాకు అడ్డుకట్టపడనుందని కలెక్టర్‌ రాజర్షి షా అన్నారు. పట్టణంలోని శాంతినగర్‌, భాగ్యనగర్‌ కాలనీల్లోని 32, 36వ చౌకధరల దుకా ణాల్లో సన్నబియ్యం పంపిణీని ప్రారంభించారు. బి య్యం తూకం వేసి స్వయంగా కార్డుదారుల కు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఇది పేదవారి గుండెల్లో శా శ్వతంగా నిలిచిపోయే పథకమన్నారు. ప్ర జలు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్‌రెడ్డి సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించారన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో భాగంగా అమలు చేస్తున్న ఈ పథకాన్ని కార్డుదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజాపాలనలో రేషన్‌కార్డులకు సంబంధించి మార్పులు, చేర్పుల కోసం ప్రజల నుంచి అందిన దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో విచారణ జరుగుతుందని త్వరలోనే కొత్త కార్డులు అందించనున్నట్లు వెల్లడించారు.కార్యక్రమంలో ఆర్డీవో వినోద్‌కుమార్‌, జిల్లా పౌరసరఫ రాల సంస్థ మేనేజర్‌ సుధారాణి, తహసీ ల్దార్‌ శ్రీనివాస్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నాయబ్‌ తహసీల్దార్‌ బాబూసింగ్‌ పాల్గొన్నారు.

కై లాస్‌నగర్‌: తెల్లరేషన్‌ కార్డుదారులకు లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పంపిణీ జిల్లాలో మంగళవారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈమేరకు జి ల్లా వ్యాప్తంగా కార్డుదారులు ఉదయమే తమ గ్రా మాలు, వార్డుల్లోని రేషన్‌ దుకాణాలకు చేరుకున్నా రు. ఆదిలాబాద్‌ పట్టణంంలోని శాంతినగర్‌, భాగ్యనగర్‌ కాలనీల్లోని చౌకధరల దుకాణాల్లో కలెక్టర్‌ రా జర్షి షా, అదనపు కలెక్టర్‌ శ్యామలాదేవితో కలిసి పంపిణీని లాంఛనంగా ప్రారంభించారు. బోథ్‌ ని యోజకవర్గ పరిధిలోని నేరడిగొండ, బోథ్‌ మండల కేంద్రాల్లోని రేషన్‌షాపుల్లో ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్‌ సన్నబియ్యం పంపిణీని షురూ చేశారు. అలాగే ఉట్నూర్‌లోని రేషన్‌ షాపులో ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌ ప్రారంభించారు. ప్రభుత్వ లక్ష్యాన్ని వివరిస్తూ బియ్యంను పేదలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే మండల కేంద్రాలు, మేజర్‌ గ్రామ పంచాయతీల్లో సంబంధిత తహసీల్దార్లు, మార్కెట్‌ కమిటీల చైర్మన్లు కార్యక్రమాన్ని ప్రారంభించారు. పలుచోట్ల అధికార పార్టీ నాయకులు సైతం పాల్గొన్నారు. మరోవైపు కార్డుదారులు బియ్యం పంపిణీపై హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు.

తొలిరోజున 242 షాపుల్లో ..

జిల్లాలో 356 రేషన్‌షాపులుండగా తొలిరోజున 242 షాపుల్లో మాత్రమే సన్నబియ్యం పంపిణీ ప్రారంభమైంది. 325 షాపులకు బియ్యం చేరినప్పటికీ పలు చోట్ల డీలర్లు దుకాణాలను తెరువలేదు. దీంతో ఆయా చోట్ల పంపిణీ ప్రారంభం కాలేదు. తొలిరోజున జిల్లా వ్యాప్తంగా 28,623 మంది రేషన్‌కార్డుదారులకు గాను 653 మెట్రిక్‌ టన్నుల బియ్యం పంపిణీ చేసినట్లుగా పౌరసరఫరాల సంస్థ అధికారులు తెలిపారు.

జిల్లాలో మొదలైన పంపిణీ

ప్రారంభించిన కలెక్టర్‌, ఎమ్మెల్యేలు

తొలిరోజున 242 షాపుల్లో..

లబ్ధిదారుల్లో హర్షం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement