
నేటి నుంచి ‘పది’ మూల్యాంకనం
● ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
ఆదిలాబాద్‌టౌన్: పదో తరగతి వార్షిక పరీక్షల మూల్యాంకనం సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే ఉపాధ్యాయులకు విధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 15 వరకు ఈ ప్రక్రియ జరగనుంది. ఆదిలాబాద్ పట్టణంలోని సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ పాఠశాలలో ఏర్పాటు చేసిన మూల్యాంకన కేంద్రాన్ని డీఈవో శ్రీనివాస్‌రెడ్డి ఆదివారం పరిశీలించారు.
725 మందికి విధులు కేటాయింపు
లక్షా 75వేల జవాబు పత్రాలు మూల్యాంకనానికి వచ్చినట్లు డీఈవో శ్రీనివాస్‌రెడ్డి, పరీక్షల విభా గం అసిస్టెంట్ కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డి తెలి పారు. 725 మంది ఉపాధ్యాయులకు విధులు కే టాయించినట్లు పేర్కొన్నారు. అదనంగా 30 శా తం మందికి విధులు కేటాయించినట్లు తెలిపా రు. 561 మందిని ఏఈలు, సీఈలుగా, ఏడుగురిని అసిస్టెంట్ ఏసీవోలుగా, 164 మందిని స్పెష ల్ అసిస్టెంట్లుగా నియమించినట్లు పేర్కొన్నారు. వీరితో పాటు 169 మంది సీఈలు, ఏఈలు, 49 మంది స్పెషల్ అసిస్టెంట్లకు అదనంగా విధులు కేటాయించినట్లు వివరించారు. క్యాంప్ ఆఫీసర్‌గా డీఈవో, స్ట్రాంగ్ రూమ్ అధికారిగా పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్, డిప్యూటీ క్యాంప్ ఆఫీసర్‌గా ఆదిలాబాద్‌అర్బన్ ఎంఈవో కేంద్రంలో విధులు నిర్వర్తించనున్నారు.
కేంద్రంలోని సౌకర్యాలు
మూల్యాంకనం కేంద్రంలో తాగునీరు, ఫ్యాన్లు, కూలర్లు ఏర్పాటు చేశారు. ప్రథమ చికిత్స కోసం ఏఎన్‌ఎం, వైద్య సిబ్బంది, మందులు అందుబా టులో ఉంచనున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రక్రియనిర్వహించనున్నారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మూల్యాంకనం నిర్వహించే గదుల్లో లైట్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఒక్కో ఉపాధ్యాయుడికి 40 పేపర్లు ఇవ్వనున్నారు. కేంద్రంలోకి సెల్‌ఫోన్ తీసుకురావద్దని జిల్లా విద్యాధికారి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.