
లక్కీడ్రా పద్ధతిపై అనాసక్తి
కై లాస్‌నగర్: ఆదిలాబాద్ పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు అధికారులు ఎట్టకేలకు దృష్టి సారించా రు. పట్టణంలోని అంబేడ్కర్‌చౌక్, గాంధీచౌక్, శివా జీచౌక్, దేవిచంద్ చౌక్‌లోని వీధివ్యాపారులను ఇత ర స్థలాలకు తరలించేందుకు ఇటీవల రెవెన్యూ అధి కారులు ప్రత్యేక సర్వే నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో 201 మంది వీధి వ్యాపారులున్నట్లు గుర్తించారు. వారికి ఖాళీగా ఉన్న గణేశ్ థియేటర్ స్థలాన్ని వ్యాపారాల కోసం కేటాయించేందుకు శుక్రవారం ఆర్డీవో వినోద్‌కుమార్ ఆధ్వర్యంలో పట్టణంలోని టీఎన్‌జీవో భవన్‌లో లక్కీడ్రా నిర్వహించారు. 201 షాపులకు గాను డ్రా తీసి ఎంపిక చేశారు. అయితే ఈ ప్రక్రియపై వీధివ్యాపారులు అంతగా ఆసక్తి చూ పలేదు. 201 మందికి గాను 10–15 మంది మాత్ర మే హాజరయ్యారు. వ్యాపారులు లేకుండానే అధికా రులు డ్రా ప్రక్రియ కానిచ్చారు. శ్రీరామ నవమి అనంతరం ఒక్కొక్కరికి 6/7 స్థలాన్ని కేటాయించనున్నట్లు మున్సిపల్ కమిషన్ సీవీఎన్ రాజు తెలి పారు. స్థలాల కేటాయింపు పూర్తయిన వెంటనే వా రందరినీ అక్కడికి తరలించనున్నట్లు వెల్లడించారు. ముందుజాగ్రత్త చర్యగా పకడ్బందీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయగా డీఎస్పీ జీవన్‌రెడ్డి స్వయంగా భద్రతను పర్యవేక్షించారు. సీఐలు సునీల్‌కుమార్, ప్రణయ్, టీపీఎస్ నవీన్‌కుమార్, సిబ్బంది వినయ్‌కుమార్, ఖుర్బాన్ తదితరులు పాల్గొన్నారు.