
ల్యాబ్ టెక్నీషియన్ల డిప్యూటేషన్ రద్దు
ఆదిలాబాద్‌టౌన్: వైద్యశాఖ లో అక్రమ డిప్యూటేషన్లు శీర్షికన ‘సాక్షి’లో శనివారం ప్రచురితమైన కథనానికి డీ ఎంహెచ్‌వో నరేందర్ రాథో డ్ స్పందించారు. డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్లు సొంత పీహెచ్‌సీలకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. వారి డిప్యూటేషన్ రద్దు చేయాలని కార్యాలయ సూపరింటెండెంట్‌కు సూచించా రు. జిల్లా కేంద్రంలోని టీబీ సెంటర్‌లో పనిచేస్తున్న ల్యాబ్‌టెక్నీషియన్లు, మలేరి యా విభాగంలో పనిచేస్తున్న మరో ఇద్దరు, టీ హబ్‌లో పనిచేస్తున్న ఒకరి డిప్యూటేషన్ రద్దు చేసి శనివారం రిలీవ్ చేశారు. మిగతా వారిని పరిశీలించి త్వరలోనే వారి డిప్యూటేషన్ కూడా రద్దు చేస్తామని డీఎంహెచ్‌వో వివరించారు.