మొత్తం అసెస్‌మెంట్లు : 48,448 | - | Sakshi
Sakshi News home page

మొత్తం అసెస్‌మెంట్లు : 48,448

Apr 9 2025 12:14 AM | Updated on Apr 9 2025 12:14 AM

మొత్త

మొత్తం అసెస్‌మెంట్లు : 48,448

ఆస్తిపన్ను డిమాండ్‌ : రూ.13.96 కోట్లు
వసూలు చేసింది : రూ.7.80 కోట్లు
ఇంకా మిగిలింది : రూ.6.15 కోట్లు

కేటగిరీల వారీగా ఇలా..

మిక్స్‌డ్‌ కేటగిరిలో 1,484 అసెస్‌మెంట్లకు రూ.1.27కోట్ల పన్ను వసూలు లక్ష్యంగా ఉండగా రూ.కోటి వసూలైంది. ఇంకా రూ.26.32లక్షలు బకాయిలున్నాయి. నాన్‌రెసిడెన్సీ కేటగిరిలో 5,033 అసెస్‌మెంట్లకు రూ.3.73కోట్ల పన్ను వసూలు లక్ష్యం ఉండగా రూ.2.56కోట్లు వసూలయ్యాయి. ఇంకా రూ.1.16కోట్లు బకాయిలున్నాయి. రెసిడెన్సీ కేటగిరిలో 41,931 అసెస్‌మెంట్లు ఉండగా రూ.8.96కోట్ల పన్ను వసూలు చేయాల్సి ఉంది. కానీ, రూ.4.73కోట్లు వసూలు కాగా, రూ.4.73కోట్లు వసూలు కావాల్సి ఉంది.

ఆదిలాబాద్‌ మున్సిపాలిటీలో పన్ను వసూలు చేస్తున్న ఉద్యోగులు (ఫైల్‌)

ప్రయత్నించినా వెనుకబడ్డాం

గత ఆర్థిక సంవత్సరంలో వందశాతం ఆస్తి పన్ను వసూలు చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగాం. ఆదిశగా ప్రత్యేక బృందాలను నియమించి పట్టణంలోని అన్ని వార్డుల్లో లక్ష్యాలను నిర్దేశించాం. వివిధ కారణాలతో నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోలేకపోయాం. కిందటేడాది సాధించిన పన్నులకు సమానంగా వసూలు చేయగలిగాం. దీంతో 15వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించి బల్దియాకు ఎలాంటి ఇబ్బంది లేదు. పట్టణ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకువచ్చి ఆస్తి పన్ను చెల్లించి రాయితీ పొందాలి. ఎర్లీబర్డ్‌ పఽథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

– సీవీఎన్‌ రాజు, మున్సిపల్‌ కమిషనర్‌

కై లాస్‌నగర్‌: ఆదిలాబాద్‌ మున్సిపాలిటీ ఆస్తిపన్ను బకాయిల వసూళ్లలో వెనుకబడింది. 2024–25 ఆ ర్థిక సంవత్సర వసూళ్ల గడువు గత మార్చి 31తో ముగిసింది. అయితే నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోలేదు. ప్రత్యేక బృందాలను నియమించి వసూళ్లు చేపట్టినా కిందటేడాది కంటే 15శాతం తక్కువగానే వసూలైంది. పెండింగ్‌ బకాయిలను రాబట్టుకునేందుకు ప్రభుత్వం వడ్డీపై 90శాతం రాయితీ కల్పించినా స్పందన అంతంత మాత్రమే వ చ్చింది. పన్నులను రాబట్టుకోవడంలో బల్దియా అధికారులు విఫలమయ్యారు.

ఆస్తి పన్నే కీలకంగా మారినా..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏడాదిగా బల్దియాకు ఆశించినస్థాయిలో నిధులు రా వడం లేదు. దీంతో పట్టణ పరిధిలో వసూలయ్యే ఆస్తి పన్ను కీలకంగా మారింది. కానీ, పన్నులు వసూలు చేయడంలో బల్దియా యంత్రాంగం వెనుకబడిపోయింది. ఆదిలాబాద్‌ పట్ట ణ పరిధిలో 48,444 అసెస్‌మెంట్లు ఉండగా 2024 –25 ఆర్థిక సంవత్సరానికి వాటి ద్వారా రూ.13.96 కోట్లు వసూలవుతాయని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. కానీ, అందులో రూ.7.80 కోట్లు మాత్రమే వసూలు చేశారు. మరో రూ.6.15 కోట్లు బకాయిలుగానే మిగిలిపోయాయి. అదే వడ్డీపై ప్రభుత్వం 90శాతం రాయితీ కల్పించాక పన్ను డిమాండ్‌ రూ.11.99 కోట్లు కాగా, అందులో రూ.7. 50 కోట్లు వసూలు చేయగలిగారు. వసూళ్లు తగ్గినప్పటికీ డి మాండ్‌ తగ్గడంతో 8శాతం పన్నులు అదనంగా వ సూలైనట్లు తెలుస్తోంది. పెండింగ్‌ బకాయిలు త్వరగా రావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మార్చి నెలా ఖరు వరకు వాటిపై విధించే వడ్డీలో 90శాతం రా యితీ కల్పించింది. కానీ, పట్టణ ప్రజలు దీన్ని అంతగా వినియోగించుకోలేదు.

కిందటేడాది కంటే తక్కువే..

2023–24 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే పన్నుల వసూళ్లు భారీగా తగ్గాయి. కిందటేడాది పన్నుల మొత్తం డిమాండ్‌ రూ.11.72 కోట్లు ఉండగా రూ.8.42 కోట్లు వసూలు చేశారు. మరో రూ.3.3 కోట్లు మాత్రమే పెండింగ్‌లో ఉంది. కిందటేడాది కంటే రూ.62లక్షలు తక్కువగానే వసూలయ్యాయి. గతంలో 62 శాతం పన్నులు వసూళ్లు చేయగా ఈసారి 55.90శాతానికే పరిమతమైంది. ఈ ఏడాది15శాతం పన్నులు తక్కువగా వసూలయ్యా యి. పన్నుల వసూళ్ల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన సమగ్ర కుటుంబ సర్వే, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు సర్వే చేపట్టింది. దీంతో రెవెన్యూ సిబ్బంది ఆ విధుల్లో నిమగ్నమవడంతో పన్నుల వసూళ్లపై ప్రభావం చూపిందనే అ భిప్రాయాన్ని బల్దియా వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మార్చి నెలాఖరులో ప్రత్యేక బృందాలు నియమించి కాలనీల్లో విస్తృతంగా తిప్పినప్పటికీ ఆఽశించిన స్థాయిలో పన్నులు వసూలు కాలేదు. ఉన్నతాధికా రుల పర్యవేక్షణ, బల్దియా అధికారుల అజమాయిషీ లేక వసూళ్లలో వెనుకబడినట్లు చెబుతున్నారు.

ఎర్లీబర్డ్‌తో 5శాతం రాయితీ

ఆస్తిపన్నును ముందస్తుగా చెల్లించే ప్రజలకు ప్రభుత్వం 5శాతం రాయితీతో కూడిన ఎర్లీబర్డ్‌ పథకాన్ని అమలు చేస్తోంది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్నును ఈ నెలాఖరులోపు చె ల్లించే ప్రజలకు పన్నులో ఐదు శాతం రాయితీ వ ర్తించనుంది. సకాలంలో పన్నులు చెల్లించినట్లయితే రాయితీ పొందడంతో పాటు వడ్డీ భారం నుంచి కూడా తప్పించుకునే అవకాశముంది.

56 శాతమే ఆస్తి పన్ను వసూలు

వడ్డీపై రాయితీ కల్పించినా అంతే..

గతేడాది కన్నా 15శాతం తక్కువే

బకాయిల వసూళ్లలో వెనుకంజ

లక్ష్యం చేరని ఆదిలాబాద్‌ బల్దియా

కేంద్రం నిధులపై సందిగ్ధం

85 శాతం ఆస్తి పన్ను వ సూలు చేసిన మున్సిపాలిటీలకే ఆర్థిక సంఘం నిధులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఆదిలా బాద్‌ మున్సిపాలిటీకి 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల కావాలంటే 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను డిమాండ్‌లో 85శాతం ట్యాక్స్‌ వసూలు చేయాల్సి ఉంది. కానీ, వడ్డీ మినహాయింపుతో కూడా ఆ లక్ష్యాన్ని చేరుకోవడంలో చతికిలపడింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వమిచ్చే ఆ నిధులు విడుదలవుతాయా.. లేదా.. అనే సందిగ్ధ పరిస్థితి నెలకొంది. అయితే ఇలాంటి పరిస్థి తి రాష్ట్రంలోని అనేక మున్సిపాలిటీల్లోనూ ఉండటంతో కేంద్రం నిధుల విడుదల నిబంధనలను సవరించే అ వకాశమందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

మొత్తం అసెస్‌మెంట్లు : 48,448 1
1/1

మొత్తం అసెస్‌మెంట్లు : 48,448

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement