● రేపటి నుంచి పదవిలోకి..
● ఇద్దరూ బీజేపీ సభ్యులే..
● జిల్లా అభివృద్ధికి పాటుపడేనా?
సాక్షి, ఆదిలాబాద్: కొత్త ఎమ్మెల్సీలు సి.అంజిరెడ్డి, మల్క కొమురయ్యల శాసన మండలి పదవీకాలం ఆదివారం నుంచి మొదలు కానుంది. ఇద్దరూ బీజే పీ నుంచి ఎంపికై న సభ్యులే. ఆరేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఎమ్మెల్సీలకు కేటాయించే నియోజకవర్గ అభివృద్ధి నిధుల పరంగా జిల్లాకు కూడా వెచ్చించి ఈప్రాంత అభివృద్ధికి దోహదప డాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది
కాషాయం పార్టీ ప్రభంజనం..
కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉ మ్మడి జిల్లాల పట్టభద్రుల, టీచర్స్ ఎన్నికల్లో కాషా యం పార్టీ ప్రభంజనం చూపించిన విషయం తెలి సిందే. పట్టభద్రుల ఎమ్మెల్సీ నుంచి సి.అంజిరెడ్డి, టీచర్స్ నుంచి కొమురయ్య ఇటీవల గెలిచారు.
ముగిసిన పదవీకాలం..
పట్టభద్రుల ఎమ్మెల్సీగా వ్యవహరించిన కాంగ్రెస్‌కు చెందిన టి.జీవన్ రెడ్డి, టీచర్స్ ఎమ్మెల్సీగా వ్యవహరించిన రఘోత్తంరెడ్డిల పదవీ కాలం శనివారంతో ముగియనుంది. 2019 నుంచి వీరు ఎమ్మెల్సీలుగా కొనసాగారు. తాజాగా ముగిసిన ఎన్నికల్లో జీవన్‌రెడ్డి పోటీ చేయలేదు. గత ఎన్నికల్లో పీఆర్టీయూ నుంచి బరిలో నిలిచిన రఘోత్తంరెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్సీ అయినా ఈసారి ఆయనకు పీఆర్టీయూ నుంచి అభ్యర్థిత్వం దక్కలేదు. ఇతర సంఘాల మద్దతుతో బరిలో నిలిచినా ఓటమి పాలయ్యారు.
కొత్త ఎమ్మెల్సీలొస్తున్నారు