
దేశ సమగ్రతకు బీజేపీ కృషి
ఆదిలాబాద్: దేశ సమగ్రతకు బీజేపీ ఎంతగా నో కృషి చేస్తోందని ఎంపీ గోడం నగేశ్ పే ర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఆదివారం పార్టీ ఆవిర్భావ దినో త్సవాన్ని నిర్వహించగా ఎమ్మెల్యే పాయల్ శంకర్‌తో కలిసి హాజరయ్యారు. ముందుగా పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. భారత ఆర్థిక వ్యవస్థ మూడో స్థానానికి చేరిందని, భవిష్యత్‌లో మ రిన్ని సానుకూల ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ పార్లమెంట్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. ఎమ్మెల్యే పా యల్ శంకర్ మాట్లాడుతూ.. బీజేపీ ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీగా ఎదిగిందని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ అధి కారంలోకి వస్తేనే ప్రగతి సాధ్యమని చెప్పా రు. ఈ దిశగా కార్యకర్తలంతా పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్య క్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పతంగే బ్ర హ్మానంద్, నాయకులు తాటిపెల్లి రాజు, ఆ కుల ప్రవీణ్ వేదవ్యాస్, మహేందర్, లాలా మున్నా, ధోని జ్యోతి, సంతోష్, కృష్ణయాద వ్, భూమేశ్, చంద్రకాంత్, అశోక్‌రెడ్డి, భూ మన్న, రాజన్న తదితరులు పాల్గొన్నారు.