
నాణ్యమైన విద్య అందించాలి
ఇంద్రవెల్లి: విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని ఐటీడీఏ పీవో కుష్బూగుప్తా సూచించారు. శుక్రవారం మండలంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్సియల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న వి ద్య, వైద్యం, భోజనం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మా ట్లాడుతూ.. విద్యార్థులకు మెనూ ప్రకారం ఆ హారం అందించాలని, సబ్జెక్టుల వారీగా అర్థమ య్యే రీతిలో బోధించాలని సూచించారు. డెంగీ, మలేరియా ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. రోజూ క్రమం తప్పకుండా వంటగది, స్టోర్ రూమ్, తాగునీరు, మరుగుదొడ్లు శుభ్రంగా ఉండేలా చూడాలని సూచించారు. అనంతరం తరగతి గదులను సందర్శించి విద్యార్థులకు పాఠాలు బోధించి సబ్జెక్టుల వారీగా వారి సామర్థ్యాలు తెలుసుకున్నారు.