
వ్యాయామ విద్యకు ఉజ్వల భవిష్యత్
ఆదిలాబాద్‌టౌన్: వ్యాయామ విద్యకు ఉజ్వల భవి ష్యత్ ఉంటుందని ఎస్‌సీఈఆర్టీ రిసోర్స్ పర్సన్ స్టాలి న్‌బాబు పేర్కొన్నారు. ప్రమోషన్ పొందిన ఉపాధ్యాయులకు ప్రభుత్వ డైట్ కళాశాలలో చేపట్టిన రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని గురువారం పరి శీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. వ్యాయామ విద్యను తప్పనిసరిగా సబ్జెక్ట్‌గా మార్చేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. సమగ్ర శిక్షా అభియాన్ కింద ప్రభుత్వం ని ధులు కూడా విడుదల చేస్తుందని తెలిపారు. హెల్త్, ఫిజికల్ ఎడ్యుకేషన్‌కు గుర్తింపు రానుందని పేర్కొన్నారు. డైట్ కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపల్ కిరణ్‌కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన వి ద్యను బోధించి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలని సూచించారు. కార్యక్రమంలో గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి పార్థసారథి, లెక్చరర్లు జయరావు, ఉమాకాంత్, రిసోర్స్ పర్సన్ భూమన్న, హరిచరణ్, పీఈటీల సంఘం జిల్లా కార్యదర్శి సాయికుమార్, మమత తదితరులు పాల్గొన్నారు.