
ధర్మ పరిరక్షణకు పాటుపడాలి
ఆదిలాబాద్: హిందూ ధర్మ పరిరక్షణకు పా టుపడాలని సనాతన హిందూ ఉత్సవ సమి తి జిల్లా అధ్యక్షుడు ప్రమోద్‌కుమార్ ఖత్రి సూచించారు. జిల్లా కేంద్రంలోని ఎంప్లాయీస్ కాలనీలో ఆదివారం శ్రీరామనవమిని పురస్కరించుకుకుని శ్రీరామ మందిర నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశంలోని ప్ర తీ ప్రాంతంలో శ్రీరాముని ఆలయాల నిర్మాణాలు కొనసాగుతున్నట్లు తెలిపారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సనాతన హిందూ ఉత్సవ సమితి తరఫున అన్ని విధాలా సహా య, సహకారాలు అందిస్తామని చెప్పారు. రామ్ మందిర్ నిర్మాణ కమిటీ అధ్యక్షుడు నందకుమార్, ప్రధాన కార్యదర్శి రాథోడ్ బాబూలాల్, దశరథ పటేల్, సమితి కార్యని ర్వాహక కార్యదర్శి కందుల రవీందర్, శర్మా జీ, షిండే, కాలనీవాసులు పాల్గొన్నారు.