
వంట గ్యాస్ ధర పెంపుపై సీపీఎం నిరసన
ఆదిలాబాద్‌టౌన్: వంట గ్యాస్ ధర పెంపు ను నిరసిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో గురువా రం ఆందోళన చేపట్టారు. పట్టణంలోని భగత్‌సింగ్ కాలనీలో ఖాళీ సిలిండర్లు, కట్టెల పొయ్యితో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేశ్ మాట్లాడుతూ వంట గ్యాస్‌పై సబ్సిడీ ఇస్తామని చెప్పి ధరలను పెంచడం సరికాదన్నారు. పెరిగిన నిత్యావసరాల ధరలతో ఇప్పటికే ఇబ్బందులకు గురవుతున్న ప్రజ లు పెట్రో ధరల పెంపుతో మరింతగా ఇ బ్బందులు ఎదుర్కోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. పెంచిన గ్యాస్ ధరను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చే శారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు నగేశ్, సునిత, మయూరి, ఆశన్న, ప్రభు, మంజుల తదితరులు పాల్గొన్నారు.