
శ్రీ విశ్వావసు వత్సరమా! స్వాగతం
శ్రీ విశ్వావసు వర్షమా స్వాగతం సుస్వాగతం
కొత్త ఉషస్సులతో.. కొంగొత్త జీవితాలనీయ..
కులమతాల అడ్డుగోడలు కూలిపోవాలని..
పసిడి పంటల రాసులతో గాదెలు నిండాలనీ..
పేద, ధనిక లేని సమసమాజం రావాలని..
మతహింస రక్షసికి మరణశాసనం రాయాలని..
మానవత్వపు విరులు ప్రతీ ఎదలో వెల్లివిరియాలని..
ఉత్తర, దక్షిణ ప్రాంతీయ భేదాలు సమసి పోవాలని..
కుళ్లు రాజకీయాలకు చెల్లు చీటి రాయాలని..
సుఖశాంతుల నిలయమై వసుధ వర్థిల్లాలని..
ప్రేమ, మైత్రి విశ్వమంతా ఆవహించాలని..
నవ శకానికి నాంది పలుకాలని..
చైత్రమాసంలో వసంతుడు పలికే..
ఓ నవవర్ష పర్వమా స్వాగతం స్వాగతం..
తీపి, వగరు, చేదు, కారం, ఉప్పు, పులుపు షడ్రుచుల పచ్చడి..
నవజీవన సారమని అందించ యుగాది..
తొలి పర్వమై ఏతెంచె శ్రీ విశ్వావసు వర్షము..
సర్వజనహితమును చేకూర్చ..
సత్సంబంధాలు నొసగ..
ఓ విశ్వాసువత్సరమా! స్వాగతం! స్వాగతం
– గంగుల చిన్నన్నా,
తెలుగు ఉపాధ్యాయుడు, భోసి
సేకరణ: తానూరు