
నీటి సమస్య పరిష్కరించాలని రాస్తారోకో
నార్నూర్: నీటి సమస్య పరిష్కరించాలని శుక్రవా రం మండల కేంద్రంలోని విజయ్‌నగర్ కాలనీవా సులు ఖాళీ బిందెలతో రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 20 రోజులుగా మి షన్ భగీరథ నీరు రాక ఇబ్బంది పడుతున్నా ఎవ రూ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అధికా రులు వచ్చి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమాచారం తెలుసుకున్న ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ శ్రీనివాస్ ఆందోళనకారులతో ఫోన్‌లో మాట్లాడారు. నూతన ట్యాంక్‌కు కనెక్షన్ ఇచ్చి రెండురోజు ల్లో పూర్తి స్థాయిలో నీటి సరఫరా చేస్తామని, అప్పటివరకు వాటర్ ట్యాంక్ ద్వారా నీటిని సరఫరా చే స్తామని హామీ ఇవ్వగా ఆందోళన విరమించారు. వీరికి ప్యాక్స్ చైర్మన్ ఆడే సురేశ్ మద్దతు తెలిపారు. బాబూలాల్, గుణవంత్‌రావ్, ప్రవీణ్, దేవిదాస్, ర వీందర్, ఊర్మిళాబాయి, శారద, నిర్మల ఉన్నారు.