
● పది రోజుల్లోనే 83.13 శాతం పంపిణీ ● వండుకునేందుకే లబ్ధ
బియ్యం బాగున్నాయి
ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్నబియ్యం బాగున్నాయి. అందులో ఎలాంటి నూకలు, తవుడు కూడా లేదు. మార్కెట్‌లో వేలాది రూపాయలు వెచ్చించి బియ్యం కొనుగోలు చేయలేని మా లాంటి వారికి ఇది ఎంతో మేలు చేస్తుంది. ఈ బియ్యంతో వండిన బువ్వ కూడా రుచిగా ఉంది. ఎప్పటికీ ఇలాగే పంపిణీ చేయాలి. – శశిరేఖ, సంజయ్‌నగర్
కొనాల్సిన అవసరం లేకుండా పోయింది
మాకు నెలకు 18 కిలోల బియ్యం వస్తాయి. దొడ్డుబియ్యంను సైతం వండుకుని తినేవాళ్లం. ఇంట్లో ఫంక్షన్లు జరిగినప్పుడు, ఎవరైనా చుట్టాలు వస్తే మాత్రం మార్కెట్‌లో రూ.50, రూ.60కి కిలో చొప్పున సన్న బియ్యం తెచ్చుకునేవాళ్లం. దీనికి నెలకు రూ.వెయ్యి వరకు అయ్యేది. ప్రస్తుతం ప్రభుత్వమే సన్నబియ్యం అందిస్తుండటంతో మాలాంటి వారికి ఎంతో మేలు జరిగినట్లయింది. బయట కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా పోయింది.
– గోలి అంజలి, గాంధీనగర్, ఆదిలాబాద్
పది రోజుల్లోనే 83శాతం పైగా తీసుకెళ్లారు..
జిల్లాకు ప్రభుత్వం కేటాయించిన కోటాబియ్యం వందశాతం చౌక ధరల దుకాణాలకు చేరాయి. గతంలో బియ్యం పంపిణీ ప్రారంభించిన పది రోజుల్లో సగం బియ్యం కూడా కార్డుదారులు తీసుకెళ్లేవారు కాదు. ప్రస్తుతం 83శాతం పంపిణీ పూర్తయింది. ప్రతీ కార్డుదారు బియ్యంను తీసుకెళుతున్నారు. వాటిని వండుకుని తింటున్నారు. మేము ప్రత్యక్షంగా కొంతమంది లబ్ధిదారుల ఇళ్లకు వద్దకు వెళ్లి పరిశీలించగా బువ్వ నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
– సుధారాణి,
డీఎం సివిల్‌సప్లై, ఇన్‌చార్జి డీఎస్‌వో
విద్యానగర్‌లోని చౌకధరల దుకాణంలో బియ్యం తీసుకుంటున్న లబ్ధిదారులు
కైలాస్‌నగర్: రాష్ట్ర ప్ర భుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పంపిణీపై పేదల్లో హర్షం వ్యక్తమవుతుంది. ఉగాది కానుకగా ఈనెల 1నుంచి చౌకధరల దుకాణాల ద్వారా బియ్యం పంపిణీని ప్రారంభించగా, కార్డుదారులు దుకాణాల ఎదుట బారులు తీరి మరీ తీసుకెళ్లారు. దొడ్డు బియ్యం పంపిణీ సమయంలో నెలాఖరు దాకా కూడా తీసుకునేందుకు ఆసక్తి చూప ని కార్డుదారులు ఈ నెల మొదటి వారంలో నే దాదాపు 83 శాతం మంది బియ్యం తీసుకెళ్లడం గమనార్హం. అయితే బియ్యం వండుకుని తిన్నవారు నాణ్యతపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సన్నబియ్యం కొనుగోలు చేయనటువంటి తమకు ఈ బియ్యంతో రుచికరమైన భోజనం అందుతుందని మెజార్టీ లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేయగా, మెత్తగా అవుతున్న బువ్వను తినలేకపోతున్నామని, నా ణ్యమైన బియ్యం సరఫరా చేయాలని మరికొందరు పేర్కొంటున్నారు.
83.13 శాతం బియ్యం పంపిణీ..
చౌకధరల దుకాణాల ద్వారా ప్రతినెలా 1వ తేదీ నుంచి 20వ తేదీ వర కు బియ్యం పంపిణీ కొనసాగుతుంది. దొడ్డు బియ్యం పంపిణీ సమయంలో నెలాఖరు వరకు దుకాణా లు తెరిచి ఉంచితే తప్పా పూర్తిస్థాయి కోటా పంపిణీ పూర్తయ్యేది కాదు. అలాంటిది ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ ప్రారంభించడమే తరువాయి ప ట్టణ, పల్లె తేడాలేకుండా జిల్లావ్యాప్తంగా అన్ని దు కాణాల ఎదుట బారులు తీరి మరీ తీసుకెళ్లా రు. కేవలం పది రోజు ల వ్యవధిలోనే 83.13 శాతం బియ్యం పంపిణీ పూర్తవడం గమనార్హం.
సన్నబువ్వపై
భిన్నాభిప్రాయాలు
ప్రభుత్వం ఒక్కో యూనిట్‌కు ఉచితంగా అందజేసిన ఆరు కిలోల బియ్యంను మెజార్టీ కార్డుదారులు మొదటి పది రోజుల్లోనే తీసుకున్నారు. ఇందులో నూకలు కానీ, తవుడు వంటివి లేకపోవడంతో ఇంటికి తీసుకువచ్చిన బియ్యం వండుకునేందుకే ఆసక్తి చూపా రు. అయితే నాణ్యతపై క్షేత్రస్థాయిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మెజార్టీ లబ్ధిదా రులు సన్న బువ్వపై సంతృప్తి వ్యక్తం చేయగా.. కొంతమంది మాత్రం వేడిగా ఉన్నప్పుడు మెత్తగా, చల్లారితే గట్టిగా అవుతుందని పేర్కొంటున్నారు.
ఇంకా ఆగని బియ్యం విక్రయాలు..
జిల్లాలో ప్రజా పంపిణీ వ్యవస్థ వివరాలు ..
చౌక ధరల దుకాణాలు : 356
మొత్తం రేషన్ కార్డులు : 1,91,755
మొత్తం యూనిట్లు : 6,32,819
ఇప్పటి వరకు బియ్యం పంపిణీ చేసిన కార్డులు : 1,51,988
ఇంకా మిగిలి ఉన్నకార్డులు : 39,767
ఇది ఆదిలాబాద్ పట్టణం ఖుర్షీద్‌నగర్‌లో గల 28 వ నంబర్ చౌకధరల దుకాణం. ఈ షాపు పరిఽ దిలో మొత్తం 525 రేషన్‌కార్డులు ఉండగా, ఇప్పటికే 480 మంది కార్డుదారులు బియ్యం తీసుకెళ్లారు. మొత్తం 112 క్వింటాళ్ల కోటాకు గాను 100 క్వింటాళ్ల బియ్యం పంపిణీ పూర్తయింది.
ప్రభుత్వం దొడ్డు బియ్యం పంపిణీ చేసిన సమయంలో లబ్ధిదారులు వాటిని తినేందుకు ఇష్టపడక డీలర్లు, మధ్య దళారులకు విక్రయించేవారు. కిలోకు రూ.15 నుంచి రూ.22 చొప్పున అమ్మేవారు. వాటిని దళారులు మహారాష్ట్రకు తరలించి సొమ్ము చేసుకునేవారు. ఇలాంటి పరిస్థితిని తొలగించి పేదలకు లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా సన్నబియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టింది. అయితే ఇందులోనూ అక్రమాలు ఆగడం లేదు. రేషన్‌కార్డులు కలిగిన కొంత మంది అనర్హులు చౌక దుకాణాల నుంచి తీసుకున్న సన్నబియ్యాన్ని సైతం ఇప్పటికీ డీలర్లు, తమ రెగ్యులర్ దళారులకు విక్రయిస్తున్నట్లుగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇది జిల్లా కేంద్రంలోని సంజయ్‌నగర్‌లో గల 21 వ నంబర్ చౌక ధరల దుకాణం. ఈ షాపు పరిధి లో 864 రేషన్‌కార్డులు ఉండగా గురువారం వ రకు 804 కార్డుదారులు బియ్యం తీసుకెళ్లారు. ప్ర తి నెలా ఇందులో సగం మంది కార్డుదారులు కూ డా 10వ తేదీ వరకు దుకాణానికే రారు. అలాంటి ది ఈ షాపునకు కేటాయించిన 175.8 క్వింటా ళ్లకు గాను 140 క్వింటాళ్ల బియ్యం పంపిణీ పూర్తవడం కార్డుదారుల ఆసక్తికి అద్దం పడుతుంది.

● పది రోజుల్లోనే 83.13 శాతం పంపిణీ ● వండుకునేందుకే లబ్ధ

● పది రోజుల్లోనే 83.13 శాతం పంపిణీ ● వండుకునేందుకే లబ్ధ

● పది రోజుల్లోనే 83.13 శాతం పంపిణీ ● వండుకునేందుకే లబ్ధ

● పది రోజుల్లోనే 83.13 శాతం పంపిణీ ● వండుకునేందుకే లబ్ధ

● పది రోజుల్లోనే 83.13 శాతం పంపిణీ ● వండుకునేందుకే లబ్ధ