
జీవాల పెంపకానికి చేయూత
● ఎన్‌ఎల్‌ఎం ద్వారా రుణాలు ● యూనిట్‌కు 50 శాతం సబ్సిడీ ● గరిష్టంగా రూ.50 లక్షల వరకు మంజూరు
యూనిట్ సబ్సిడీ
లక్ష్మణచాంద(నిర్మల్): దేశంలో పెరుగుతున్న జనా భాకు అనుగుణంగా మాంసం ఉత్పత్తులు పెంచా లని కేంద్రప్రభుత్వం భావిస్తోంది. మాంసానికి ఉ న్న డిమాండ్ దృష్ట్యా జీవాల పెంపకాన్ని ప్రోత్సహి ంచాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా గొర్రెలు, మేకల పెంపకానికి నేషనల్ లైవ్‌స్టాక్ మిష న్ స్కీం(ఎన్‌ఎల్‌ఎం) ద్వారా ఔత్సాహికులకు సబ్సి డీ రుణాలు అందిస్తోంది. 2021–22లో ప్రారంభించిన ఈ పథకాన్ని రాష్ట్ర పశుసంవర్థక శాఖ అమలు చేస్తోంది. ఈ పథకం కింద పెంపకందారులకు ఒక్కో యూనిట్‌కు 50 శాతం సబ్సిడీ ఇస్తున్నట్లు జిల్లా పశు వైద్యాధికారులు పేర్కొంటున్నారు. యూనిట్ మంజూరైనప్పటి నుంచి పూర్తిస్థాయిలో సబ్సిడీ నిధులు విడుదలయ్యే వరకు రాష్ట్ర పశుసంవర్థక శాఖ పర్యవేక్షిస్తుందని అధికారులు తెలిపారు. గరిష్టంగా యూనిట్‌కు రూ.50 లక్షల వరకు రుణం అందించనున్నారు. ఈ రుణం డబ్బులను రెండు విడతలుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు.
దరఖాస్తు ఇలా..
గొర్రెలు,మేకల యూనిట్ల పెంపకం రుణం మంజూరు కోసం www. nim. udyamimitra. in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలి. ఈ రుణాలు పొందడానికి దరఖాస్తు చేయడానికి ఎలాంటి ఫీజులు చెల్లించనవసరం లేదని అధికారులు అంటున్నారు. రుణం మంజూరుకు దరఖాస్తు చేస్తున్న ఉత్సాహవంతులు తమ పాన్, ఆధార్ కార్డు, అడ్రస్ ఫ్రూఫ్, పాస్‌ఫొటో, రుణం తీసుకునే బ్యాంకు స్టేట్‌మెంట్లను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి.
అర్హతలు
1. కనీసం ఐదెకరాల వ్యవసాయ భూమిని కలిగి ఉండాలి. ఇతరులదైనా లీజుకు తీసుకోవాలి.
2. పశు పోషణలో తగిన అనుభవం ఉండాలి.
3. యూనిట్ మంజూరు కోసం బ్యాంక్ కాన్‌సెంట్ తీసుకోవాలి.
(గొర్రెలు,పొట్టేళ్లు) (రూ.లక్షల్లో)
500–25 50
400–40 40
300–15 30
200–10 20
100–05 10
పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి
నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్ పథకాన్ని గొర్రెలు, మేకల పెంపకంపై ఆసక్తి ఉన్న యువత సద్వినియోగం చేసుకోవాలి. ఈ దరఖాస్తు చేసుకుని యూనిట్ పొంది ఉపాధితో ఆర్థికంగా ఎదగాలని పేర్కొన్నారు. వివరాల కోసం జిల్లా కార్యాలయంలో సంప్రదించాలి.
– ఎండీ బాలిగ్ అహ్మద్,
జిల్లా పశువైద్యాధికారి, నిర్మల్

జీవాల పెంపకానికి చేయూత