
స్పౌజ్ బదిలీలకు గ్రీన్ సిగ్నల్
● ఉమ్మడి జిల్లాలో ఆరుగురికి అవకాశం ● ఆసిఫాబాద్ నుంచి ఆదిలాబాద్‌కు నలుగురు, మంచిర్యాలకు ఇద్దరు రాక ● ఈనెల 23న విధుల్లో చేరనున్న ఉపాధ్యాయులు
ఆదిలాబాద్‌టౌన్: స్పౌజ్ బదిలీలకు ప్రభుత్వం మ రోసారి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇటీవల 38 మంది స్పౌజ్ ఉపాధ్యాయులు (భార్య, భర్త) ఇతర జిల్లాల నుంచి జిల్లాకు వచ్చిన విషయం తె లిసిందే. తాజా గా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ స్పౌజ్ బదిలీలకు సంబంధించి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆరుగురు సొంత జి ల్లాలకు బదిలీపై వెళ్లనున్నారు.కుమురంభీం ఆసిఫా బాద్ నుంచి ఆదిలాబాద్‌కు నలుగురు స్కూల్ అసిస్టెంట్లు (తెలుగు) బదిలీపై రానుండగా, ఆసిఫాబా ద్ నుంచి మంచి ర్యాలకు ఇద్దరు సాంఘిక శాస్త్రం ఎస్‌ఏలు బదిలీపై వెళ్లనున్నారు. 317ద్వారా నష్టపో యిన టీచర్లకు ప్రభుత్వం ఊరట కల్పించింది.
23న రిలీవ్..
సంబంధిత జిల్లాలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఈనెల 22న రిలీవ్ అయి వారికి కేటాయించి న జిల్లాలో 23న విధుల్లో చేరాలని విద్యాశాఖ డై రెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే ఇటీవల మ్యూచువల్ బదిలీలకు సంబంధించి ఉత్తర్వులు జారీ అయిన విషయం తెలిసిందే. ఆదిలాబాద్ జి ల్లాకు 24 మంది మ్యూచువల్ బదిలీపై రానుండగా, అదే సంఖ్యలో ఇతర జిల్లాలకు ఇక్కడి నుంచి వెళ్లనున్నారు. మంచిర్యాల నుంచి ఓ సీనియర్ అసిస్టెంట్ డీఈవో కార్యాలయానికి రానుండగా, ఇక్కడినుంచిఒకరు మంచిర్యాలకు వెళ్లనున్నారు.
బదిలీలు హర్షణీయం
ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా స్పౌజ్ బదిలీలు చేపట్టడం హర్షణీయమని టీయూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీకాంత్, జలందర్‌రెడ్డి ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 165 మందికి స్పౌజ్ బదిలీలు జరిగాయని పేర్కొన్నారు. అప్పట్లో 38 మంది ఉపాధ్యాయులకు బదిలీలు జరగగా, సాంకేతిక కారణాలతో మిగిలిపోయిన వారికి ప్రస్తుతం బదిలీలు చేపట్టినట్లు తెలిపారు.