
‘తులం బంగారం ఎప్పుడిస్తరు..?’
బజార్‌హత్నూర్: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం కల్యాణలక్ష్మి చెక్కుతో పాటు తు లం బంగారం ఎప్పుడిస్తుందో రాష్ట్ర మహిళలకు చె ప్పాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. మండల కేంద్రంలో 42మంది కల్యాణలక్ష్మి లబ్ధి దా రులకు బుధవారం ఆయన చెక్కులు పంపిణీ చేశా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పేదింటి ఆడబిడ్డ పెళ్లి తల్లిదండ్రులకు భారం కాకూడదని నాడు కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం తీసుకువచ్చారన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని విస్మరించిందన్నారు. పార్టీ యువజన సంఘం మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ అధ్వర్యంలో ‘తులం బంగారం ఎక్కడ’ అనే ప్లకార్డులు ప్రదర్శించారు. ఇందులో తహసీ ల్దార్ శ్యాంసుందర్, ఎంపీడీవో శ్రీనివాస్, డీటీ హీరాలాల్, ఆర్‌ఐ నూర్‌సింగ్, తదితరులున్నారు.