
తెలుగుదనం ఉట్టిపడేట్టు
పంచకట్టు.. సంప్రదాయ వస్త్రధారణ. కాలంలోపాటు వస్త్రధారణ మారినా.. తెలుగుదనం ఉట్టిపడేది మాత్రం పంచకట్టులోనే. వృత్తులు, విధులు, ఉద్యోగాల రీత్యా వస్త్రధారణ వేరుగా ఉంటుంది. అయినా ఉమ్మడి జిల్లాకు చెందిన కొందరు నేటికీ సంప్రదాయ పంచకట్టులో ఠీవీ చాటుకుంటున్నారు. సంస్కృతి, సంప్రదాయాన్ని భావితరాలకు అందిస్తున్నారు. వస్త్రధారణ ఆధారంగానే ‘మాది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా’.. మేం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులం’ అని చెప్పకనే చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు రైతులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు తెలుగుదనం ఉట్టిపడేలా ఇప్పటికీ తెల్లని చొక్కా, ధోవతి, కండువా ధరిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. తెలుగు సంస్కృతిని చాటి చెప్తున్నారు.
‘సరికొత్త ఉగాది‘
అదిగదిగో.. వస్తోంది
విశ్వావసు నామ సంవత్సర ఉగాది!
తెలుగు కొత్త సంవత్సరంలో
వెలుగులు విరజిమ్ముతూ..
కొత్త ఆశల చిగుర్లతో
పాత క్యాలెండరుని పారద్రోలి..
ఓ కొత్త తెలుగు క్యాలెండర్‌గా ఉనికిని చాటడానికి!!
విశ్వావసు క్రాంతితో..
తెలుగువారి లోగిళ్లలో..
వస్తున్నాడదిగో కొంగొత్త కాంతితో..
సరికొత్త ఉగాది!!
షడ్రుచుల కొత్త మేళవింపు
వసంతాన్ని వెంటబెట్టుకొని
చైత్రంతో సరాగాలాడుతూ
లేత మామిడి చిగురులు
మానవాళికి ఓ తాంబూలం
కొమ్మలపై కూర్చున్నా కోకిలమ్మలు మధురంగా కూస్తూ
విశ్వావసును స్వాగతిస్తున్నాయి
మానవాళికి కొత్త సందేశానిస్తున్నాయి..
రైతన్నల కళ్లలో పరిఢవిల్లే ఓ కొత్తకాంతి..
నిజమైన ప్రశాంతి విశ్రాంతి!!
ముంగిళ్లలో ముత్యాల ముగ్గులు పరిచి..
రతనాల రంగులు వేసి స్వాగతం పలుకుదాం!!
– అంబటి నారాయణ, తెలుగు
ఉపాధ్యాయుడు, చామన్‌పెల్లి పాఠశాల సేకరణ: లక్ష్మణచాంద
● ఆహార్యంలో పంచకట్టు ఠీవీ.. ● ప్రత్యేకత చాటుకుంటున్న ఉమ్మడి జిల్లా వాసులు
సంప్రదాయం మరవలేదు
బజార్‌హత్నూర్: మండల కేంద్రానికి చెందిన మల్లెపూల నర్సయ్య తెలుగు సంస్కృతికి అద్దంపట్టేలా 40 ఏళ్లుగా పంచెకట్టు (దోవతి) ధరిస్తున్నాడు. 1981లో పీహెచ్‌డీ పూర్తి చేశాడు. రాజకీయాలపై మక్కువతో కాంగ్రెస్‌లో చేరి 2001, 2019లో బజార్‌హత్నూర్ జెడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఉన్నత చదువులు చదివినా రాజకీయాల్లో రాణిస్తున్నా తెలుగు సంప్రదాయ కట్టుబాట్లను ఇప్పటికీ ఆచరిస్తున్నారు.
తెలుగులోనే సంతకం
బోథ్: మండల కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు భవానీ ఆనంద్ అర్లి బి గ్రామంలోని మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో గణిత శాస్త్రం బోధిస్తున్నారు. అతనికి చిన్నతనం నుండి తెలుగు భాష అంటే అభిమానం. అందరూ ఇంగ్లిష్‌లో సంతకం చేస్తున్నా తనుమాత్రం 40 ఏళ్లుగా తెలుగులోనే చేస్తున్నారు. తెలుగుపై తనకున్న అభిమానం చాటుకుంటున్నార
పెద్దల నుంచి వస్తున్న ఆచారం
తాంసి: తెలుగుదనం ఉట్టిపడేలా, నిండు గంభీరంగా కనిపిస్తున్న ఈ రైతు తాంసి మండలంలోని పొన్నారి గ్రామానికి చెందిన కేమ లక్ష్మణ్. దశాబ్దాల నుంచి ప్రతీరోజు తెల్లని చొక్కా, దోవతి, కండువా ధరించి తెలుగు రైతుకు నిర్వచనంలా కనిపిస్తాడు. తమది వ్యవసాయ కుటుంబమని, తమపెద్దలు ఆచరించినట్లుగా తాను కూడా తెలుగు రైతు సంప్రదాయాన్ని కచ్చితంగా పాటిస్తూ ఉంటానని పేర్కొంటున్నాడు.
ఈ ఉగాది.. కొత్త పునాది
తెలతెల్లవారే కోయిల రాగాలతో
పచ్చని మామిడి తోరణాలతో
ముంగిట హరివిల్లు రంగులతో
ఈ ఉగాది.. కొత్తజీవితానికి పలికే నాంది..
నోరూరించే బూరెలతో
కోరికోరి చేసే పిండివంటలతో
షడ్రుచుల సమ్మేళన పచ్చడితో
ఈ ఉగాది.. జీవనపోరాటానికి పునాది..
చిన్నపెద్దల నూతన వస్త్రాలతో
సంస్కృతీ సంప్రదాయాల కొత్తపండుగతో
శ్రీవిశ్వావసు నామ సంవత్సరంతో
ఈ ఉగాది.. విశ్వాసానికి వారధి..
– ఆయిటి సాహితి, యువకవి, నిర్మల్
సేకరణ: నిర్మల్
‘విశ్వావసు’కు
స్వాగతం పలుకుదాం
అణగారిన గుండెగూళ్ల నిండా ఆశల ఊసులు అల్లుతూ..
స్నేహ సౌరభాల తోరణాలతో ‘విశ్వావసు’కు స్వాగతం పలుకుదాం..
సమస్యలను, సవాళ్లను సమర్థవంతంగా
ఎదుర్కొనేందుకు ఆత్మవిశ్వాసంతో ముందుకెళదాం..
తీపి జ్ఞాపకాల మధురిమలో గత చేదు మరచి..
మమకారాల మాధుర్యాన్ని నలుగురితో పంచుతూ ఆశగా జీవితాన్ని ప్రేమిద్దాం.
– రాఘవేంద్ర దారవేణి, తాంసి, ఆదిలాబాద్
సేకరణ: తాంసి

తెలుగుదనం ఉట్టిపడేట్టు

తెలుగుదనం ఉట్టిపడేట్టు

తెలుగుదనం ఉట్టిపడేట్టు

తెలుగుదనం ఉట్టిపడేట్టు

తెలుగుదనం ఉట్టిపడేట్టు

తెలుగుదనం ఉట్టిపడేట్టు