
బెట్టింగ్ నిర్వహిస్తే చర్యలు
● ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలో బెట్టింగ్‌ను పూర్తిగా నిషేధించినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపా రు. బెట్టింగ్ నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆదివారం నలుగురి పై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఐ పీఎల్ బెట్టింగ్ నిర్వహించే వారిపై నిఘా పెట్టినట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలోని రాంనగర్‌లో బెట్టింగ్ నిర్వహిస్తూ ఒకరు పట్టుబడినట్లు పేర్కొన్నారు. బెట్టింగ్ నిర్వహిస్తున్న మహారా ష్ట్రలోని కిన్వట్‌కు చెందిన ఆరిఫ్, లడ్డూ చౌహా న్‌పై కేసు నమోదు చేసి వీరి నుంచి మొబైల్ ఫో న్, రూ.5వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. పిట్టలవాడకు చెందిన గంథాడే సోహన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తుండగా మా వల పార్క్ వద్ద పట్టుకున్నట్లు తెలిపారు. అత ని నుంచి మొబైల్, రూ.5వేలు స్వాధీనం చేసుకుని మావల పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఆదిలాబాద్ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని భుక్తాపూర్‌లో ఖిల్లా ప్రాంతానికి చెందిన సుల్తాన్ బెట్టింగ్ నిర్వహిస్తుండగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
అప్రమత్తతే ఆయుధం
అప్రమత్తతే ఆయుధమని ఎస్పీ అఖిల్ మహాజ న్ పేర్కొన్నారు. వారం రోజుల్లో జిల్లా వ్యాప్తంగా నమోదైన సైబర్ నేరాల వివరాలను ఆదివా రం వెల్లడించారు. ఆన్‌లైన్‌లో థర్డ్ పార్టీ యా ప్స్ ఇన్‌స్టాల్ చేసుకోకుండా జాగ్రత్తపడాలని సూచించారు. సైబర్ నేరాలు, క్రిప్టో కాయిన్, మల్టీ లెవెల్ మార్కెటింగ్, డిజిటల్ అరెస్ట్, లోన్ అప్ ఫ్రైడ్, స్టాక్ మార్కెటింగ్‌లో అపరిచిత వ్య క్తులతో ట్రేడింగ్, ఇన్‌వెస్ట్‌మెంట్ ఫ్రాడ్స్, నకిలీ లోన్ యాప్స్, నకిలీ వెబ్‌సైట్‌పై అప్రమత్తంగా ఉంటూ సైబర్ నేరాల బారిన పడకుండా ఉండాలని వివరించారు. మావల, టూటౌన్, తాంసి, బజార్‌హత్నూర్ ఠాణాల పరిధిలో నమోదైన సైబర్ క్రైమ్ కేసుల గురించి వివరించారు.