
సర్వాయి పాపన్నకు ఘన నివాళి
కై లాస్‌నగర్: సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి వేడుకలను కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం అధికారికంగా నిర్వహించారు. కలెక్టర్ రాజర్షి షా, వివిధ శాఖల అధికారులు, గౌడ కులస్తులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ, పాపన్నగౌడ్ ఆశయాలను కొనసాగించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, జిల్లా బీసీ సంక్షేమాధికారి కె.రాజలింగు, కలెక్టరేట్ ఏవో వర్ణ, తహసీల్దార్ శ్రీనివాస్, గౌడ సంఘం ప్రతినిధులు, కులస్తులు పాల్గొన్నారు.
మహనీయుల జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి
మహనీయుల జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. బాబూ జగ్జీవన్ రామ్, బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి ఉత్సవాల నిర్వహణపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్పీ అఖిల్ మహాజన్‌తో కలిసి దళితసంఘాల నాయకులతో బుధవారం సమీక్షించారు. ఈనెల 5న జగ్జీవన్‌రామ్ జయంతి, 14న అంబేడ్కర్ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించనున్నట్లుగా తెలిపారు. పట్టణంలోని ఎస్టీయూ భవన్‌లో నిర్వహించనున్న వేడుకలకు మున్సిపల్, పంచాయతీ, విద్యుత్, విద్య, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీవో వినోద్‌కుమార్, డీఎస్సీడీవో సునీత, దళిత ససంఘ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.