
తాళం వేసిన ఇంట్లో చోరీ
నిర్మల్‌రూరల్: జిల్లా కేంద్రం శివారులోని బొమ్మరిల్లు టౌన్‌షిప్‌లో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగినట్లు రూరల్ ఎస్సై లింబాద్రి తెలిపారు. కాలనీలో నివాసం ఉంటున్న బొబ్బిలి శ్రీకాంత్‌రెడ్డి సోమవారం కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లారు. సోమవారం రాత్రి దొంగలు ఇంటి మెయిన్ డోర్ పగులగొట్టి లోనికి ప్రవేశించారు. బెడ్‌రూంలో బీరువాలో ఉన్న నగదు, బంగారం ఎత్తుకెళ్లారు. మంగళవారం ఉదయం ఇంటికి వచ్చిన శ్రీకాంత్‌రెడ్డి చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రూరల్ ఎస్సై లింబాద్రి సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు.