
పూలే జయంతికి ఏర్పాట్లు చేయాలి
ఆదిలాబాద్‌రూరల్: ఈ నెల 11న జిల్లా కేంద్రంలోని పూలే చౌక్, బీసీ స్టడీ సర్కిల్ సెంటర్ ఆవరణలో గల పూలే విగ్రహాల వద్ద నిర్వహించనున్న మహాత్మా జ్యోతిబా పూలే జయంతికి ఏర్పాట్లు చేయాలని బీసీ, మాలీ సంఘాల నేతలు కోరా రు. పూలే జయంతి నిర్వహణపై మంగళవారం జిల్లాలోని బీసీ, మాలీ సంఘాల నేతలతో జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారి రాజలింగు తన కా ర్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలోని పూలే చౌక్, బీసీ స్టడీ సర్కిల్ సెంటర్ ఆవరణలో గల పూలే విగ్రహాల వద్ద ఏర్పాట్లు చే యాలని సూచించారు. జయంతి వేడుకలకు వ చ్చేవారికి రవాణా సౌకర్యం కల్పించాలని కోరా రు. జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించే వే డుకలకు హాజరయ్యే వారికి భోజనం, నీటి వసతి కల్పించాలని సూచించారు. ప్రొటోకాల్ ప్రకారం వివిధ సంఘాలు, రాజకీయ పార్టీల నాయకుల కు ముందస్తు ఆహ్వాన పత్రాలు అందించాలని నాయకులు కోరారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చి క్కాల దత్తు, కలాల శ్రీనివాస్, మాలీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుకుమార్ పేట్కులే, బీసీ సంఘాల నాయకులు మ్యాకల అశోక్, రవీందర్, శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.