
సకాలంలో పన్ను చెల్లించాలి
ఆదిలాబాద్‌టౌన్: సకాలంలో త్రైమాసిక ట్యాక్స్ చెల్లించాలని, లేకుంటే వాహనదారులకు నోటీసులు జారీ చేస్తామని డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషన ర్ (డీటీసీ) రవీందర్‌కుమార్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని రవాణాశాఖ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 2024 సంవత్సరానికి సంబంధించి ట్యాక్స్ లక్ష్యం 90 శా తం పూర్తి చేసినట్లు తెలిపారు. 15 ఏళ్లు దాటిన ప్రైవేట్ బస్సులను రోడ్డుపై తింపవద్దని పేర్కొన్నారు. తిప్పకుండా ఉంచే వాహనాల వివరాల ను ఆర్టీవో కార్యాలయంలో తెలిపితే ట్యాక్స్ మినహాయింపు ఉంటుందని తెలిపారు. మైనర్లు వా హనాలు నడిపితే తల్లిదండ్రులపై కేసులు నమో దు చేస్తామని హెచ్చరించారు. ఆరు నెలల్లో నిబంధనలు అతిక్రమించిన వెయ్యి ప్రైవేట్ ట్రావెల్స్‌పై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. కొత్తగా వాహన సారథి పోర్టల్‌ను ప్రభుత్వం అమలు చేయనుందని తెలిపారు. గుడిహత్నూర్ సమీపంలో ఏటీఎస్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు పే ర్కొన్నారు. మావలలోని చావర స్కూల్‌లో ఏర్పా టు చేసిన రోడ్డు నిబంధనలకు సంబంధించి చిల్డ్రన్స్ అవగాహన పార్క్‌ను త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆయన వెంట జిల్లా రవా ణాశాఖ అధికారి సీపెల్లి శ్రీనివాస్, భోరజ్ చెక్‌పో స్ట్ ఇన్‌చార్జి అల్లి శ్రీనివాస్, ఎంవీఐ ప్రదీప్‌కుమార్, ఏఎంవీఐలు రవీందర్, హరింద్రకుమార్, అప ర్ణ, మోహన్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.