
ప్రజావాణికి వినతుల వెల్లువ
సాగునీరు విడుదల చేయాలి
అయ్యా.. ఈ యేడు సాగు చేసిన పత్తి పంట లో గులాబీరంగు పురుగు ఉధృతి పెరగడంతో ఆ పంటను తొలగించాం. మత్తడివాగు ప్రాజెక్ట్ నీటి ఆధారంగా యాసంగి సీజన్‌లో జొన్న పంటను సాగు చేశాం. ప్రస్తుతం చివరిదశలో ఉన్న పంటకు నీరు అందకపోవడంతో ఎండిపోయే పరిస్థితి ఉంది. మత్తడివాగు ప్రధాన కాలువ నుంచి నీటిని విడుదల చేయాలని ఇరిగేషన్‌శాఖ అధికారులకు పలుమార్లు విన్నవించగా ఈ నెల 1నుంచి విడుదల చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు నీటిని విడుదల చేయలేదు. తమరు స్పందించి నీటిని విడుదల చేసేలా చర్యలు తీసుకుని పంటలను కాపాడాలి.
– జందాపూర్ రైతులు, ఆదిలాబాద్
కైలాస్‌నగర్: ప్రజావాణిలో అందించే అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ బాధితులకు భరోసా కల్పించాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన బాధితుల నుంచి రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవితో కలిసి అర్జీలు స్వీకరించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తులను సంబంధితాధికారులకు అందజేస్తూ వాటిని పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. కాగా ఈ వారం వివిధ సమస్యలకు సంబంధించి మొత్తం 111 అర్జీలు అందాయి. అందులో కొందరి నివేదన వారి మాటల్లోనే...
అర్జీలు స్వీకరించిన కలెక్టర్ రాజర్షి షా
సత్వరమే పరిష్కరించాలని ఆదేశం

ప్రజావాణికి వినతుల వెల్లువ