
వైద్యవృత్తి పవిత్రమైంది
● ఎస్పీ అఖిల్ మహాజన్ ● రిమ్స్‌లో అట్టహాసంగా గ్రాడ్యుయేషన్ డే
ఆదిలాబాద్‌టౌన్: వైద్యవృత్తి ఎంతో పవిత్రమైంద ని, గ్రాడ్యుయేట్ పట్టాలు పొందిన మెడికోలు రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. శుక్రవారం రాత్రి రిమ్స్‌లో నిర్వహించిన గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. 2019 బ్యాచ్‌కు చెందిన మెడికోలకు రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్‌తో కలిసి పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మా ట్లాడుతూ, ప్రతి ఒక్కరూ వృత్తిని దైవంగా భావించాలన్నారు. ప్రజలు వైద్యులను దేవునితో సమానంగా పోల్చుతారని పేర్కొన్నారు. తనది కూడా వైద్య కుటుంబమని, సేవాభావంతో వైద్య వృత్తిని నిర్వర్తించాలని సూచించారు. ర్యాగింగ్, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని పేర్కొన్నారు. ముందుగా గుస్సాడీ, సాంస్కృతిక నృత్యాలతో మెడికోలు ఆకట్టుకున్నారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి, రిమ్స్ సూపరింటెండెంట్ అశోక్, సత్యనారాయణ, వంజారి, మెడికోలు తదితరులు పాల్గొన్నారు.

వైద్యవృత్తి పవిత్రమైంది

వైద్యవృత్తి పవిత్రమైంది