
‘అసాంఘిక చర్యలు అరికడతాం’
ఆదిలాబాద్‌టౌన్: అసాంఘిక చర్యలను అరికడతా మని ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. గురువా రం పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోని సమావేశ మందిరంలో ఆదిలాబాద్ సబ్ డివిజనల్ పోలీస్ అధికారులతో నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. జిల్లా వ్యా ప్తంగా నమోదైన కేసుల వివరాలు తెలుసుకున్నా రు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. గంజా యి స్మగ్లర్లపై నిఘా ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. త్వరలో ప్రారంభించనున్న ‘పోలీస్ మీకోసం’ కార్యక్రమాన్ని ప్రతీవారం ఒక్కో గ్రామంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పెండింగ్ గ్రేవ్ కేసులు, నాన్ గ్రేవ్ కేసులు, పోక్సో, ఇన్వెస్టిగేషన్ కేసులపై విచారణ జరిపి అధికారుల ద్వారా వివరాలు తెలుసుకున్నారు. కోర్టు డ్యూటీ అధికారి విధులను పర్యవేక్షిస్తూ పెండింగ్ కేసుల వివరాలు ఎప్పటికప్పుడు నవీకరించాలని తెలిపారు. సాక్షులను కోర్టులో హాజరుపర్చి నిందితులకు శిక్ష పడేలా చూడాలని పేర్కొన్నారు. రాత్రివేళ అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తుల వేలిముద్రలు సేకరించి ఆన్‌లైన్‌లో పొందుపర్చాలని సూచించారు. సమీక్షా స మావేశంలో డీఎస్పీలు జీవన్‌రెడ్డి, నాగేందర్, సీఐ లు సునీల్‌కుమార్, కరుణాకర్, శ్రీనివాస్, ప్రణయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.