
వినియోగదారుల సమస్యల పరిష్కారానికి కృషి
ఆదిలాబాద్: వినియోగదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు బీఎస్‌ఎన్‌ఎల్ ఏరియా డివిజనల్ ఇంజనీర్ ఎస్.శివనాగేశ్వరరావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయంలో సోమవారం వినియోగదారుల సేవా కేంద్రాన్ని ఎస్‌డీఈ చంద్రశేఖర్‌తో కలిసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఎంఎన్‌పీ, సిగ్నల్, కనెక్టివిటీ, ఇంటర్నెట్, టెలిఫోన్ బిల్లులకు సంబంధించిన సమస్యలపై వినియోగదారులు సేవా కేంద్రాల్లో ఫిర్యాదు చేయవచ్చన్నారు. ‘మేము వింటాం –మేము మెరుగుపరుస్తాం’ నినాదంతో కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కేంద్రానికి వచ్చిన 25 ఫిర్యాదులలో 20 పరిష్కరించగా ఐదింటిని త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు. ఈనెల 8, 16, 23 తేదీల్లో నిర్మల్, 9, 28న కాగజ్‌నగర్, 11, 25, 29 తేదీల్లో మంచిర్యాల, 12, 24 తేదీల్లో ఖానాపూర్, 15, 21న బెల్లంపల్లి, 17, 26 తేదీల్లో ఆసిఫాబాద్, 19, 30 తేదీల్లో భైంసాలలో సేవాకేంద్రాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏజీఎం ఎన్.రంజిత్, ఎస్డీఈలు, జేటీవోలు పాల్గొన్నారు.