
వ్యాపార అభివృద్ధికి దోహదం
ఆదిలాబాద్‌కు రవాణా సౌకర్యం మెరుగుపడుతుండగా ప్రస్తుతం అనేక బహుళజాతి కంపెనీల కిరాణా, వస్త్ర సంస్థలు ఇక్కడికి రానున్నాయి. ఇప్పటికే ఇండియన్ నేషనల్ మార్ట్ ఏర్పాటు కాగా, త్వరలో డీ మార్ట్‌ను మావలలో ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన పనులు కూడా మొదలయ్యాయి. దస్నాపూర్‌లో జుడియో వస్త్ర, కాస్మొటిక్ సంస్థ భారీ మాల్‌ను ఏర్పాటు చేస్తోంది. ఇందుకు సంబంధించి పనులూ మొదలయ్యాయి. సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌ను రవితేజ సమీపంలోని స్థలంలో ఏర్పాటు చేయనున్నారు. అంతే కాకుండా కిసాన్, సీఎంఆర్ షాపింగ్ మాల్స్ కూడా ఏర్పాటవుతున్నాయి.