
డీఈవో ప్రణీతకు సన్మానం
ఆదిలాబాద్‌టౌన్: జిల్లా విద్యాశాఖాధికారి టి.ప్రణీతను కార్యాలయ అధికారులు, ఉద్యోగులు శని వారం ఘనంగా సన్మానించారు. ఈ నెల 31న ఉ ద్యోగ విరమణ పొందనున్న నేపథ్యంలో ముందస్తుగా పూలమాలలు, శాలువాలతో సత్కరించా రు. పుష్పగుచ్ఛాలు అందజేసి వీడ్కోలు పలికా రు. నిర్మల్ జిల్లాలో ఏడీగా, డీఈవోగా పనిచేసిన ఈమె 2021 నవంబర్‌లో జిల్లాలో ఇన్‌చార్జి డీఈవోగా బాధ్యతలు చేపట్టారు. కార్యక్రమంలో ఏడీ వేణుగోపాల్‌గౌడ్, ఏసీ వేణుగోపాల్ రెడ్డి, సూపరింటెండెంట్ మధుసూదన్‌రెడ్డి, డైట్ కళా శాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ కిరణ్ కుమార్, సెక్టోరియల్ అధికారులు ఉదయశ్రీ, సుజాత్‌ఖాన్, నారాయణ, శ్రీకాంత్ గౌడ్, డైట్ కళాశాల సూపరింటెండెంట్ మమత పాల్గొన్నారు.
జిల్లా విద్యాశాఖ అఽధికారిగా దుర్గా ప్రసాద్
ఆదిలాబాద్‌టౌన్: జిల్లా నూతన విద్యాశాఖ అధికారి (ఎఫ్‌ఏసీ)గా ఎన్‌వీ.దుర్గా ప్రసాద్ నియామకమయ్యారు. ప్రస్తుత డీఈవో ప్రణీత ఈ నెల 31న పదవీ విరమణ పొందనున్నారు. ఈ క్రమంలో ఆమె స్థానంలో హైదరాబాద్‌లోని డైరెక్టర్ కార్యాలయంలో మోడల్ స్కూల్ విభాగం డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న దుర్గా ప్రసాద్‌ను నియమిస్తూ విద్యాశాఖ డైరెక్టర్ మదన్ మోహన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన ఏప్రిల్ 1న బాధ్యతలు స్వీకరించనున్నారు.