
కదిలించిన ‘సాక్షి’ చర్చావేదిక..
మార్చి 6న ప్రచురితమైన ‘సాక్షి చర్చావేదిక’ కథనం
ఆదిలాబాద్ విమానాశ్రయాన్ని పౌర కార్యకలాపాల కోసం అభివృద్ధి చేయాలనే తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థనను భారత వైమానిక దళంతో సంప్రదించి పరిశీలించాం.. భవిష్యత్తులో అక్కడ శిక్షణ సంస్థ ఏర్పాటు చేయాలని భారత వాయుసేన (ఐఏఎఫ్) భావిస్తుంది.. దాన్ని పరిగణలోకి తీసుకొని మొదట ఆదిలాబాద్ నుంచి పౌర విమాన కార్యకలాపాల కోసం రాష్ట ప్రభుత్వ ప్రతిపాదనకు సూత్రప్రాయంగా అంగీకరిస్తున్నాం.. ఇది ఏప్రిల్ 1న కేంద్ర ప్రభుత్వం రక్షణ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ (ఐఏఎఫ్) సనాప్ బాజీరావు రాంనాథ్ నుంచి తెలంగాణ ప్రభుత్వ రవాణా, రోడ్లు, భవనాల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరికి అందిన ఉత్తర్వు.
సివిల్ టెర్మినల్, ఎయిర్‌క్రాఫ్ట్ పార్కింగ్ ఆఫ్రాన్ ఇతర మౌలిక సదుపాయాల కోసం జిల్లా కేంద్రంలో నాడు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) సూచన మేరకు సర్వే చేసిన భూమిని స్వాధీనం చేసుకుంటామని భారత వాయుసేన (ఐఏఎఫ్) పేర్కొంది. ఈ ఎయిర్‌ఫీల్డ్‌ను జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్‌గా అభివృద్ధి చేయవచ్చని ఇదే ఉత్తర్వుల్లో వెల్లడించింది.
మార్చి 9న ప్రచురితమైన కథనం
మార్చి 16న ప్రచురితమైన కథనం
సాక్షి,ఆదిలాబాద్: ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి దీనికి సంబంధించి ఆదేశాలు వెలువడ్డాయి. ఏఏఐతో కలిసి నిర్మాణా త్మకంగా ముందుకెళ్తామని ఐఏఎఫ్ స్పష్టం చేసింది. తద్వారా రానున్న రోజుల్లో ఈ ఎయిర్‌ఫీల్డ్‌ను జాయింట్ యూజర్‌గా అభివృద్ధి పరిచి భవిష్యత్‌లో వైమానిక శిక్షణ కేంద్రంగా ఏర్పాటు చేయనున్నట్లు భావిస్తోంది.
దశాబ్దాల కల
ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టు అనేది నాలుగు దశాబ్దాల నుంచి ఉన్న డిమాండ్. ఎట్టకేలకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించడంతో హర్షం వ్యక్తమవుతుంది. ఆదిలాబాద్ పట్టణంలోని ఖానాపూర్ కాలనీని ఆనుకుని 362 ఎకరాలతో విస్తరించి ఉన్న విమానాశ్రయ మైదానం నిజాం కాలం నుంచే విమానాల రాకపోకలకు అనువుగా ఉంది. ఇక్కడ విమానాశ్రయం ఏర్పాటు చేయాలని ఏళ్లుగా డిమాండ్ ఉన్నా కార్యరూపం దాల్చలేదు. తెలంగాణ ఉద్యమం కీలక దశకు చేరుకున్న సమయంలో మరోసారి ఇక్కడ విమానాశ్రయం ఏర్పా టు తెరపైకి వచ్చింది. విమానాశ్రయానికి అనుకూలంగా ఉందా.. శిక్షణ కేంద్రానికి అనుకూలంగా ఉందా.. అనే దానిపై 2011–12లోనే సర్వే చేశారు. ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయాలంటే అదనంగా 1500 ఎకరాలకు పైగా భూమి అవసరమనే నివేదిక అప్పట్లో కేంద్రం నుంచి వచ్చింది. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అప్పట్లో కలెక్టర్‌గా ఉన్న అహ్మద్ బాబు సర్వే ల్యాండ్ శాఖతో సర్వే చేయించారు. కచ్‌కంటి, ఖానాపూర్, అనుకుంట, తంతోలి పరిధిలోకి వచ్చే గ్రామాల భూముల ను తీసుకోవచ్చని పేర్కొనడం జరిగింది. ఆ తర్వా త ఎయిర్‌పోర్టు ఏర్పాటు అంశం మరుగున పడినప్పటికీ అడపదడపా ఈ అంశం ప్రస్తావనకు రావ డం, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి బడ్జెట్ సమయంలో కదలిక వస్తుందని ఆశించినా కల నెరవేరలేదు. ఎట్టకేలకు దీనిపై నిర్మాణాత్మక కార్యాచరణ మొదలు కావడంతో హర్షం వ్యక్తమవుతుంది.
ప్రస్తుతం ఆదిలాబాద్ ఎంపీగా ఉన్న గొడం నగేశ్, గతంలో బీజేపీ ఎంపీగా వ్యవహరించిన సోయం బాపురావు, అంతకుముందు ఎంపీలుగా వ్యవహరించిన నేతలు ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టు ఏర్పాటు విషయంలో ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులను పలుమార్లు కలిశారు. ఎట్టకేలకు కేంద్రం నుంచి అంగీకారం రావడం, ఇటు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ సర్కారు కూడా ప్రత్యేక చొరవ చూపడంతో ముందడుగు పడినట్లయింది.
ఆదిలాబాద్‌కు ఎయిర్‌పోర్టు కేంద్రం నుంచి గ్రీన్‌సిగ్నల్ భవిష్యత్తులో వైమానిక శిక్షణ కేంద్రంగా.. ఏఏఐతో కలిసి నిర్మాణాత్మకంగా ముందుకెళ్తామన్న ఐఏఎఫ్ సామాజిక బాధ్యతగా ‘సాక్షి’ ముందడుగు ‘జనం గొంతుక’కు అభినందనల వెల్లువ
జిల్లా కేంద్రంలో ఎయిర్‌పోర్టు ఆవశ్యకత.. ఈ ప్రాంతవాసుల మనోభావాలను ‘సాక్షి’ అక్షర రూపంలో ప్రతిబింబించింది. సామాజిక బాధ్యతగా ముందడుగు వేసింది. దశాబ్దాల కల సాకారం చేయాలని వారి తరఫున గొంతెత్తింది. చర్చా వేదికకు శ్రీకారం చుట్టి అన్ని వర్గాలను ఆహ్వానించింది. ‘రెక్కలపై ఆశలు’ అంటూ మేధావులు, నిపుణులు, నాయకుల అభిప్రాయాలను పాలకుల దృష్టికి తీసుకెళ్లింది. రాజకీయాలకతీతంగా ఐక్యతా రాగం వినిపించేలా చొరవ చూపింది. ‘మామ.. విమానాశ్రయం వస్తే మనకేమొస్తది..’ అంటూ స్థానిక యాసలో వివరించిన కథనం అందరినీ ఆలోచింపజేసింది. ఈ ప్రాంత ప్రజాప్రతినిధులపై ఒత్తిడి పెరిగింది. దీంతో చట్టసభల్లో వారు గొంతెత్తారు. శాసనసభలో స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఈ విషయాన్ని ప్రస్తావించగా.. ఎంపీ నగేశ్ సైతం పార్లమెంట్‌లో గళమెత్తారు. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందిస్తూ.. ‘ఆదిలాబాద్‌కు ఎయిర్‌పోర్ట్ తెస్తా.. ఆ బాధ్యత నాది’ అంటూ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో తాజాగా ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు సంబంధించి కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖలో భాగమైన భారత వాయుసేన(ఐఏఎఫ్) నుంచి గ్రీన్‌సిగ్నల్ లభించింది. విషయాన్ని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ధ్రువీకరించడంతో ఈ ప్రాంతవాసుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ‘సాక్షి’ చొరవకు జిల్లావ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తాయి. మరోవైపు ‘జనం గొంతుక’గా సదా మీ సేవలోనే అంటూ అభయమిస్తోంది మన ‘సాక్షి’.
కేంద్ర మంత్రులను కలుస్తూ..
వరంగల్‌లోని మామునూర్ ఎయిర్‌పోర్టు ఏర్పాటు విషయాన్ని ఇటీవల ప్రకటించినప్పుడు ఆదిలాబాద్ అంశాన్ని ప్రస్తావించకపోవడంతో ఈ ప్రాంత వాసుల్లో నిరాశ వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ చొరవ తీసుకొని గత మార్చి 5న జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవన్‌లో ‘ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు సాధన కోసం’ చర్చా వేదిక నిర్వహించింది. మేధావులు, ప్రముఖులు పాల్గొని ఈ ప్రాంత వాసుల దశాబ్దాల కల నెరవేర్చాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. అదే వేదిక పైనుంచి ఎయిర్‌పోర్టు సాధన కోసం అడహక్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ చర్చావేదిక తర్వాత ప్రధానంగా ఈ ప్రాంత ప్రజాప్రతినిధులపై ఒత్తిడి పెరి గింది. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే ఇద్దరూ బీజేపీ ప్రజాప్రతినిధులుగా ఉండడంతో అదే రోజు ఎంపీ నగేశ్ ఆ దిలాబాద్‌లో విలేకరుల సమావేశం నిర్వహించి తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లోనూ ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించాలని అసెంబ్లీలో ఈ ప్రాంత ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రస్తావించగా.. దానికి సీఎం రేవంత్ రెడ్డి కూ డా సానుకూలంగా స్పందించారు. వరంగల్ ఎయిర్‌పోర్టును తానే తెచ్చానని, ఆ దిలాబాద్‌కు కూడా సాధిస్తానని స్వయంగా చెప్పడం గమనార్హం. ఈ క్ర మంలోనే ఐఏఎఫ్ నుంచి గ్రీన్‌సిగ్నల్ లభించింది. ఇలా ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు విషయంలో ‘సాక్షి’ చొరవపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా చర్చావేదిక ద్వారానే కదలిక వచ్చిందని పలువురు అభినందనలు తెలిపారు.
‘సాక్షి’ చొరవ అభినందనీయం..
‘సాక్షి’ ఆధ్వర్యంలో మార్చి 5న నిర్వహించిన చర్చావేదికలో నాతో పాటు అనేక మంది పాల్గొన్నారు. ఆ రోజు అందరం గొంతెత్తి ఈ విషయంలో ఏకతాటిపై పోరాడాలని నిర్ణయించాం. అడహక్ కమిటీని కూడా ఏర్పాటు చేశాం. ఆ ప్రయత్నంలో స్థానిక ప్రజాప్రతినిధులపై ఒత్తిడి పెరిగింది. దీంతో పార్లమెంట్, అసెంబ్లీలో ప్రస్తావనకు రావడం, ఎయిర్‌పోర్టు కు ముందడుగు పడటం శుభపరిణామం. ‘సాక్షి’ చొరవను జిల్లా ప్రజలంతా అభినందిస్తున్నారు. –ఎస్.అశోక్, ఎయిర్‌పోర్టు సాధన అడహక్ కమిటీ అధ్యక్షుడు
గొప్ప అచీవ్‌మెంట్..
నరేంద్ర మోదీ ఆదిలాబాద్‌కు వచ్చివెళ్లిన తర్వాత ఏమి ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీ తో పాటు పలువురు విమర్శించారు. ఇప్పుడు విమానాశ్రయం ఏర్పాటుకు కేంద్రం నుంచి ప్రాథమికంగా అనుమతి లభించింది. రానున్న రోజుల్లో శిక్షణ కేంద్రం కూడా ఏర్పడుతుంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ఇక్కడ వ్యా పార, వాణిజ్య అభివృద్ధికి దోహద పడుతుంది. సీఎం రేవంత్‌రెడ్డి సానుకూలంగా వ్యవహరించడం శుభపరిణామం. ఢిల్లీ, హైదరాబాద్ స్థాయిలో విస్తృతంగా ప్రయత్నాలు చేశాను. అటు కేంద్ర మంత్రులను, ఇటు రాష్ట్రాన్ని ఒప్పించడం ద్వారా మా ఈ ప్రయత్నం సక్సెస్ అయ్యింది. – పాయల్ శంకర్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే
రక్షణ శాఖ మంత్రి పర్మిషన్ ఇచ్చారు..
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆది లాబాద్ ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు అనుమతి ఇ చ్చారు. ప్రధానంగా ఇటీవల నేను రెండు సార్లు పార్లమెంట్‌లో ఈ అంశాన్ని ప్రస్తావించాను. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ప్రతిపాదన రావ డం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లకు ఆదిలా బాద్ ప్రజల పక్షాన కృతజ్ఞతలు. – గోడం నగేశ్, ఆదిలాబాద్ ఎంపీ

కదిలించిన ‘సాక్షి’ చర్చావేదిక..

కదిలించిన ‘సాక్షి’ చర్చావేదిక..

కదిలించిన ‘సాక్షి’ చర్చావేదిక..

కదిలించిన ‘సాక్షి’ చర్చావేదిక..