
రాజ్యాంగ పరిరక్షణే కాంగ్రెస్ ధ్యేయం
● రాష్ట్ర కనీస వేతన సలహాబోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్
కై లాస్‌నగర్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మతపరమైన రాజకీయాలు, నియంతృత్వ పోకడలతో దేశాన్ని భ్రష్టు పట్టిస్తోందని తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్ ఆరోపించారు. పట్టణంలో శనివారం నిర్వహించి న జైబాపు, జైభీం జైసంవిధాన్ జిల్లా సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. రా జ్యాంగ పరిరక్షణే ధ్యేయంగా రాహుల్ గాంధీ చే పట్టిన జై బాపు, జై భీం, జై సంవిధాన్ నినాదంతో ప్రతి ఒక్కరం ముందుకు సాగుదామని పిలు పునిచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సుపరిపాలనను అందిస్తుందన్నారు. రాజ్యాంగ పరిరక్షణ నినాదంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను పార్టీ శ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. అనంతరం అందరితో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు దుర్గం భాస్కర్, నరేష్ జాదవ్, ఆత్రం సుగుణ, ఆడె గజేందర్, గోక గణేష్‌రెడ్డి, ఫైజుల్లాఖాన్, లోక ప్రవీణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.