
శ్రీకాకుళం: సికింద్రాబాద్ హౌరా- ఫలక్‌నుమా రైలుకు పెను ప్రమాదం తప్పింది. ఇంజిన్‌తో సహా రెండు భాగాలుగా రైలు బోగీలు విడిపోయాయి. పలాస మండలం సుమ్మాదేవి, మందస రైలు నిలయం మధ్యలో రైలు నుంచి 8 బోగీలు విడిపోయాయి. ఏ1 ఏసీ కోచ్ దగ్గర కప్లింగ్ దెబ్బతినడంతో 8బోగీలు విడిపోవడంతో రైలు అక్కడికక్కడే నిలిచిపోయింది. దీంతో పెను ప్రమాదమే తప్పింది.
సుమారు మూడు గంటల నుంచి రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే ఇంజనీరింగ్ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. బోగీలను జాయింట్ చేసిన తర్వాత రైలు బయల్దేరనుంది.