
సాక్షి, తిరుపతి: పరమ పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలపై ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. తిరుమల కొండపైకి గుట్కా, మద్యం యథేచ్ఛగా సరఫరా అవుతున్నాయి. ఘాట్ రోడ్డులో తినిపడేసిన గుట్కా ప్యాకెట్లు కుప్పలుకుప్పలుగా దర్శనమివ్వడం భక్తులను కలవరపెడుతోంది.
అలిపిరి వద్ద నామమాత్రపు తనిఖీలు జరగడమే ఇందుకు కారణమన్న వాదన వినిపిస్తోంది.నిఘావ్యవస్థ నిద్రపోతుండడం వల్లే తిరుమల కొండపైకి నిత్యం నిషేధిత వస్తువులు తరలిపోతున్నట్లు తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా అధికారులు ఏదీ పట్టించుకోవడం లేదు.
ఇదీ చదవండి: చంద్రబాబు సర్కార్.. మళ్లీ కన్సల్టెంట్ల రాజ్యం