
సాక్షి, అమరావతి: నైఋతి బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాలలో దక్షిణ కోస్తా ఆంధ్ర, ఉత్తర తమిళనాడులకు 5.8 కిమీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ కేంద్ర వెల్లడించింది. ఈ ఉపరితల ఆవర్తం ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి దిశ వైపుకు వంపు తిరిగి ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో పశ్చిమ విదర్భ నుంచి దక్షిణ కోస్తా ఆంధ్ర, తెలంగాణ మీదుగా 1.5 కిమీ ఎత్తు వద్ద అల్పపీడన ద్రోణి ఏర్పడినట్లు వాతావారణ కేంద్ర అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన:
ఉత్తర, దక్షిణ కోస్తా ఆంధ్ర, యానాం,రాయలసీమ ప్రాంతాల్లో ఈరోజు(బుధవారం) ఉరుములు, మెరుపులుతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. అలాగే భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. అదే విధంగా రేపు ఈ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులుతో పాటు ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక శుక్రవారం కూడా ఈ మూడు ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.