
సాక్షి, విశాఖపట్నం: మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత సబ్బం హరి కరోనా బారినపడ్డారు. మూడు రోజుల క్రితం పరీక్షలు నిర్వహించగా కోవిడ్ పాజిటివ్‌గా నిర్థారణైంది. వెంటనే నగరంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఆదివారం ఆరోగ్య పరిస్థితి కాస్త విషమంగా ఉందని ఆస్పత్రి వైద్య వర్గాలు వెల్లడించాయి. పది రోజుల క్రితం ఆయనకు కోవిడ్ సోకడంతో వైద్యుల సూచనతో హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. అయితే గత మూడు రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.