
●ఉపకరణాలన్నీ ఒకేసారి వాడొద్దు
వేసవి.. అందునా అధిక ఉష్ణోగ్రత ఉన్న నేపథ్యాన ఇళ్లలో అన్ని ఎలక్ట్రికల్ ఉపకరణాలను ఒకేసారి వినియోగించకపోవడమే మేలని ఖమ్మానికి చెందిన ఎలక్ట్రీషియన్ కె.ద్రోణయ్య చెబుతున్నారు. ఆయన సూచనల మేరకు గృహవాసులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
●ఏసీలు, గీజర్ వంటి అధిక లోడ్ తీసుకునే పరికరాలను ఒకేసారి వాడితే షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంది. అవసరాలకు అనుగుణంగా.. ఓల్టేజీ ఆధారంగా ఉపకరణాలను వినియోగించాలి. ఎండ తీవ్రత ఉన్న కాలంలో వైరింగ్ సరిచూసుకోవాలి. ఇంటి వైరింగ్‌కు తప్పనిసరిగా ఎర్తింగ్ ఉండేలా చూసుకుని.. ఎర్తింగ్ ప్రాంతంలో అప్పుడప్పుడు నీరు పోయాలి.