
ప్రైవేట్ టెలికాం కంపెనీలు రీఛార్జ్ ధరలను పెంచడంతో చాలా మంది వినియోగదారులు ప్రభుత్వ రంగ టెలికాం ప్రొవైడర్ బీఎస్ఎన్ఎల్ వైపు దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో మనింత మంది యూజర్లను ఆకర్షించడానికి బీఎస్‌ఎన్‌ఎల్ కొత్త ప్లాన్లను ప్రవేశపెడుతోంది. దాని తాజా ఆఫర్లలో ఒకటైన రూ.251 ప్రీపెయిడ్ డేటా ప్లాన్ మార్కెట్‌లో పోటీని రేకెత్తిస్తోంది.
పరిమిత కాల ఆఫర్
బీఎస్ఎన్ఎల్ కొత్తగా ప్రవేశపెట్టిన రూ.251 ప్లాన్ 60 రోజుల వ్యాలిడిటీతో 251 జీబీ హైస్పీడ్ డేటాను అందిస్తుంది. పెద్ద మొత్తంలో కంటెంట్‌ను స్ట్రీమ్ చేసేవారికి, ముఖ్యంగా ఐపీఎల్ 2025 మ్యాచ్‌లను బఫరింగ్ లేకుండా ఆస్వాదించాలనుకునే క్రికెట్ అభిమానులకు ఇది అద్భుతమైన ఎంపిక. అయితే, ఇది పరిమిత కాల ఆఫర్, కాబట్టి దీనిని సద్వినియోగం చేసుకోవాలనుకునే వినియోగదారులు వెంటనే బీఎస్ఎన్ఎల్ యాప్ లేదా వెట్‌సైట్ ద్వారా రీఛార్జ్ చేసుకోవాలి.
ఇది చదివారా? సరికొత్త రీచార్జ్ ప్లాన్.. సగం ఖర్చుతోనే ఎక్కువ రోజులు అన్‌లిమిటెడ్
రీచార్జ్ చేసుకునేవారు ముందుగా గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇది డేటా-ఓన్లీ ప్లాన్. అంటే ఇందులో అపరిమిత కాలింగ్ లేదా ఎస్ఎంఎస్ ప్రయోజనాలు ఉండవు. మీకు ఆ సేవలు అవసరమైతే అదనపు రీఛార్జ్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ప్రైవేట్ టెలికాం ప్రొవైడర్ల నుండి పెరుగుతున్న డేటా ఖర్చుల నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్ బడ్జెట్ ఫ్రెండ్లీ డేటా ఎంపిక కోసం చూస్తున్నవారికి ఇది అనువైన ప్లాన్.