
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో (ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం) ఈక్విటీల్లో రూ.7,715 కోట్లను ఇన్వెస్ట్ చేసింది. కార్మిక శాఖ సహాయ మంత్రి రామేశ్వర్‌తెలి ఈ విషయాన్ని లోక్‌సభకు లిఖితపూర్వకంగా తెలిపారు.
నిబంధనల ప్రకారం ఈపీఎఫ్‌వో తన నిర్వహణలోని మొత్తం నిధుల్లో 15 శాతాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అయితే, ఈపీఎఫ్‌వో నేరుగా షేర్లలో కాకుండా ఈటీఎఫ్‌ల్లో ఇన్వెస్ట్ చేస్తుందని మంత్రి స్పష్టం చేశారు. 2020–21లో ఈపీఎఫ్‌వో ఈక్విటీల్లో రూ.31,025 కోట్లను, 2019–20లో రూ.32,377 కోట్లు, 2018–19లో రూ.27,743 కోట్ల చొప్పున ఇన్వెస్ట్ చేయడం గమనార్హం.