
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‍కార్ట్ ఇప్పుడు 'హలో సమ్మర్ డేస్ సేల్' (Hello Summer Days) పేరుతో సేల్స్ ప్రారంభించింది. ఈ స్పెషల్ ఆఫర్ కేవలం మార్చి 22 నుంచి మొదలై 26 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇందులో ఎయిర్ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్ల కొనుగోలుపై భారీ డిస్కౌంట్స్ పొందవచ్చు.
ఫ్లిప్‍కార్ట్ ప్రారంభించిన 'హలో సమ్మర్ డేస్ సేల్'లో ఎయిర్ కండీషనర్ కొనుగోలుపై 55 శాతం, రిఫ్రిజిరేటర్ల మీద 60 శాతం డిస్కౌంట్స్ పొందవచ్చు. అంతే కాకుండా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్, డెబిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం అడిషనల్ డిస్కౌంట్ పొందవచ్చని ఫ్లిప్‍కార్ట్ తెలిపింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రమే కాకుండా ఇతర బ్యాంకు కార్డులపై 'నో కాస్ట్ ఈఎమ్ఐ' సదుపాయం పొందవచ్చు. కావున సామ్‍సంగ్, వోల్టాస్, ఎల్‍జీ, వాల్‍పూల్, హయెర్, గోద్రెజ్ వంటి కంపెనీల రిఫ్రిజిరేటర్లను సాధారణ ధరల కంటే తక్కువ ధరలోనే కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం దాదాపు అన్ని కంపెనీ బ్రాండ్ కొనుగోలుపై డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. బ్యాంక్ కార్డు వినియోగించుకుని మరింత తక్కువ ధరకే వీటిని కొనుగోలు చేయవచ్చు.
(ఇదీ చదవండి: Jayanti Chauhan: వేల కోట్ల కంపెనీకి లేడీ బాస్.. జయంతి చౌహాన్)
కంపెనీ అందిస్తున్న ఈ స్పెషల్ ఆఫర్ కింద సామ్‍సంగ్ 1.5 టన్ కన్వర్టబుల్ 5-ఇన్-1 3-స్టార్ ఏసీ కేవలం రూ. 37,999కే కొనుగోలు చేయవచ్చు. అదే సమయంలో ప్యానసోనిక్ 1.5 టన్ ఇన్వర్టర్ వైఫై కనెక్ట్ ఏసీ, ఎల్‍జీ కన్వర్టబుల్ 6-ఇన్-1 3 స్టార్ ఏసీ, లాయిడ్ 1.5 టన్ 3 స్టార్ ఏసీ కూడా తక్కువ ధరలోనే కొనుగోలు చేయవచ్చు.