Global Stars Jr NTR And Ram Charan Joined Threads App - Sakshi
Sakshi News home page

Meta Threads: మెటా థ్రెడ్స్‌లోకి టాలీవుడ్‌ హీరోలు.. ఫస్ట్‌ ఎంట్రీ ఎవరిదంటే?

Published Fri, Jul 7 2023 3:53 PM | Last Updated on Fri, Jul 7 2023 4:13 PM

Jr NTR and Ram Charan Entry in new meta threads app - Sakshi

Meta Threads: ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ 'ట్విటర్' ప్రత్యర్థిగా మెటా ఇప్పుడు కొత్త 'థ్రెడ్స్‌' (Threads) అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి అందరికి తెలిసిందే. ఇది విడుదలైన అతి తక్కువ సమయంలో మిలియన్ల మంది యూజర్లు దీన్ని డౌన్లోడ్ చేసుకున్నారు. సాధారణ పౌరులు మాత్రమే కాకుండా ఈ యాప్‌ని సెలబ్రిటీలు సైతం డౌన్లోడ్ చేసుకుంటున్నారు.

ప్రముఖ టాలీవుడ్ యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ థ్రెడ్స్‌ యాప్ డౌన్లోడ్ చేసుకున్న మొదటి సెలబ్రిటీ అని భావిస్తున్నారు. ఆ తరువాత రామ్ చరణ్ కూడా ఈ కొత్త యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్యాన్స్‌ని ఫిదా చేశారు. దీంతో అభిమానులు కూడా పెద్ద ఎత్తున డౌన్లోడ్ చేసుకుని వారిని ఫాలో అవ్వడం మొదలు పెడుతున్నారు.

(ఇదీ చదవండి: ట్విటర్‌కు పోటీగా మెటా థ్రెడ్స్‌.. నిమిషాల్లోనే సంచలనం.. ఇలా లాగిన్ అవ్వండి!)

నివేదికల ప్రకారం మెటా థ్రెడ్స్‌ యాప్ కొన్ని గంటల్లోనే ట్విటర్‌ను షేక్ చేసినట్లు తెలిసింది. దీనిని కేవలం 2 గంటల్లో 20 లక్షలు, 4 గంటల్లో 50 లక్షల మంది డౌన్లోడ్ చేకున్నట్లు సంస్థ సీఈఓ జూకర్ బర్గ్ అధికారికంగా తెలిపాడు. ఈ సందర్భంగా అతడు సుమారు 11 సంవత్సరాల తరువాత ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ చేసాడు. ఇది ఎలాన్ మస్క్‌ని ఉద్దేశించి చేసినట్లు చాలామంది అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement