
ముంబై: ఇటాలియన్ సూపర్ స్పోర్ట్స్ కార్ల తయారీ సంస్థ లంబోర్గిని భారత మార్కెట్లో మంగళవారం సరికొత్త లగ్జరీ కారును విడుదల చేసింది. ‘హురాకన్ ఈవీఓ రేర్–వీల్ డ్రైవ్ స్పైడర్’ పేరుతో ఆవిష్కరించిన ఈ కారు ధర రూ.3.54 కోట్లుగా ఉంది. ఇందులో అమర్చిన వీ10 ఇంజిన్‌కు గరిష్టంగా 610 హెచ్‌పీ సామర్థ్యం ఉంది. ఈ కొత్త కారు కేవలం 3.5 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. గంటకు 324 వేగంతో ప్రయాణించగలదని కంపెనీ వెల్లడించింది.